JAISW News Telugu

Second Test : రెండో టెస్టులో భారత్ సంచలన విజయం

Second Test

Second Test

Second Test : బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతం చేసింది. మొదటి రోజు 35 ఓవర్ లు మ్యాచ్ సాగగా రెండో, మూడు రోజులలో కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. కాన్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్లో భారీ వర్షం కారణంగా రెండు రోజుల ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. కాగా మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన బంగ్లా 233 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత నాలుగో రోజు బ్యాటింగ్ చేసిన ఇండియా గౌతమ్ గంభీర్ సలహాలతో సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లోనే ఫాస్టెస్ట్ ఆప్ సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. టీమిండియా  287 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి మొదటి ఇనింగ్స్ ని డిక్లేర్ చేసింది.

55 పరుగుల ఆదిత్యంతో బంగ్లాదేశ్ కు నాలుగో రోజు సాయంత్రం బ్యాటింగ్ అప్పచెప్పింది. కాగా బంగ్లాదేశ్ 90 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఐదో రోజు ఆటకు రెడీ అయింది. ఈ సమయంలో అందరూ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇండియా బౌలర్లు గొప్ప పట్టుదల ప్రదర్శించి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొదటి మూడు వికెట్లు తీయగా జస్ ప్రీత్ బూమ్రా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను అవుట్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను పెవిలియన్ పంపారు.
కాగా భారత బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో విజృంభించి  కేవలం 96 పరుగుల టార్గెట్ ని అలవోకగా పూర్తి చేసి మ్యాచ్ లో గాలి చారు. యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ బా ది తన సత్తా నిరూపించుకున్నాడు. రెండో టెస్టులో గెలుపుతో భారత్ కు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమయింది. రాబోయే ఎనిమిది టెస్టుల్లో కేవలం నాలుగు గెలిచి నా భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడం ఈజీ అవుతుంది.

Exit mobile version