Trade war : ట్రేడ్ వార్‌లో భారత్ స్థానం.. లాభాలు, సవాళ్లు

Trade war
Trade war : అమెరికా-చైనా ట్రేడ్ వార్‌లో భారత్‌కు అవకాశాలు, సవాళ్లు రెండూ ఉన్నాయి. అమెరికా చైనాపై 145% టారిఫ్‌లు విధించడంతో, భారత్‌పై 27% టారిఫ్‌లు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో చైనాకు బదులుగా భారత్ నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశం అమెరికాకు ఆకర్షణీయంగా ఉంది. ఇది భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రసాయన, ఫార్మా రంగాలకు లాభం చేకూరుస్తుంది.
ఐఫోన్‌ల తయారీలో ఆపిల్ వంటి కంపెనీలు భారత్‌ను ఎంచుకోవడం దీనికి ఉదాహరణ. అలాగే, చైనా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను తగ్గిస్తే, భారత సోయాబీన్, కాటన్ ఎగుమతులకు అవకాశం లభిస్తుంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ సేవల్లో భారత్‌కు డిమాండ్ పెరగవచ్చు.
మరోవైపు సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్ చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటుంది. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు పెరిగితే, భారత తయారీదారులకు ఖర్చు పెరుగుతుంది. లోగిస్టిక్స్, నైపుణ్యం లేని శ్రమ, భూమి సంస్కరణలు, న్యాయ వ్యవస్థలో జాప్యం వంటి సమస్యలు చిన్న తయారీదారులను ఇబ్బంది పెడతాయి.
గ్లోబల్ మార్కెట్‌లో వియత్నాం వంటి దేశాలతో పోటీ తప్పదు. టారిఫ్‌లు తాత్కాలికంగా తగ్గినా, 90 రోజుల తర్వాత పెరిగే అవకాశం ఉంది. అందుకే, భారత్ సంస్కరణలు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి.