India Vs Bangladesh : వార్మప్ మ్యాచ్ లో బంగ్లాపై ఇండియా గ్రాండ్ విక్టరీ
India Vs Bangladesh : టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యా చెలరేగి ఆడారు. సిక్సులు, ఫోర్లతో ఫుల్ ప్రాక్టీస్ చేసుకున్నారు. రిషబ్ పంత్ వరుసగా రెండు సిక్సులు బాది ఫామ్ లోకి వచ్చాడు. రోహిత్ శర్మ, సంజు శాంసన్ లు తక్కువ స్కోరుకే పరిమితమైన పంత్, హర్దిక్ దూకుడుగా ఆడి భారీ స్కోరు అందించారు. సంజు ఓపెనర్ గా రాగా.. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు.
రిషబ్ పంత్ 32 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అనంతంరం రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. శివమ్ దూబె స్కోరు చేయడానికి కష్టపడ్డాడు. .శివమ్ దూబె కొట్టిన షాట్ ను మహ్మదుల్లా బౌండరీ లైన్ వద్ద అద్బుతంగా క్యాచ్ పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా తన్వీర్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. సూర్య కుమార్ 31 పరుగుల వద్ద ఔట్ కాగా.. ఇండియా 20 ఓవర్లకు 182 పరుగులతో ఇన్సింగ్స్ ముగించింది. హర్దిక్ పాండ్యా 40 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
బంగ్లాదేశ్ రెండో ఇన్సింగ్స్ లో భారత బౌలర్ అర్షదీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో ఓపెనర్లను ఔట్ చేశాడు. సౌమ్యసర్కార్, లిటన్ దాస్ 1 పరుగుకే ఔట్ కాగా.. సిరాజ్ వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి 13 పరుగులకే మూడు వికెట్లు తీశారు. అనరంత తంజీబ్, కాసేపు ఆడినా 39 పరుగులకు నాలుగు వికెట్లు, 41 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.
బంగ్లా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో చివరకు 119 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఇన్సింగ్స్ ను ముగించింది. ఇండియా బౌలర్లలో అర్షదీప్ 2, శివమ్ దూబె రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసి భారత్ విజయాన్ని ఖాయం చేశారు.