JAISW News Telugu

Dr. Jai Yalamanchili : భారత్ అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమవుతుంది.. డాక్టర్ జై యలమంచిలి

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili : అమెరికాలోని న్యూజెర్సీ లో జరిగిన ఎన్నారైల సమావేశంలో దేశంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు పై సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా.. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జై. యలమంచిలి మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి 240 సీట్లు బీజేపీ గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ, జనతా దల్, మిగతా ఇండిపెండెట్ల సపోర్టుతో 300 సంఖ్య దాటి బీజేపీ ఎన్డీఏ అలయన్స్ పటిష్టంగా ఉందన్నారు.

బీజేపీ సొంతంగా 400 సీట్లు సొంతం చేసుకుంటుందని ముందుగా ఊహించామని కానీ ఫలితాలు కాస్త నిరాశ కలిగించినా.. దేశంలోనే ఎక్కువ మంది ఎంపీలతో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపించి.. దేశాన్ని పురోగభివృద్దిలో తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యలమంచిలి జేఎస్ డబ్య్లూ టీవీకి, చానల్ కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో బీజేపీ అధికారం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విజయంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు. బీజేపీ ఐడియాలజీతో పాటు ఏపీలో చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ లు కలిసి ఏపీలో అభివృద్ధి లో ముందుకు సాగుతుందని అన్నారు. దేశం యొక్క ప్రొగ్రెస్ అని, జనతా కా ప్రొగ్రెస్ అని అన్నారు.

మోదీ, ఎన్డీఏ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఎన్నారైలు అందరూ బీజేపీకి ఎన్డీఏకు సపోర్టు చేస్తామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలకు కచ్చితంగా సపోర్టు చేస్తామన్నారు. బయట నుంచి ఎన్నారైల సాయం కచ్చితంగా అందిస్తామన్నారు. టెక్నాలజీ, సాఫ్ట్ వేర్, ఇతర పరిశ్రమల రంగాలకు సాయమందిస్తారని డాక్టర్ జై యలమంచిలి అన్నారు. ఈ విజయాన్ని అందరూ పండగ చేసుకోవాలని అన్నారు. బీజేపీకి 240 మాత్రమే ఉన్నాయని అనుకోవద్దు.. మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ లాంటి ఎంతో ఎక్స్ ఫీరియన్స్ ఉన్న నేతలు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని రకాల అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారని డాక్టర్ యలమంచిలి అన్నారు. ఈ విజయాన్ని ఎన్నారైలు అందరూ సంబరాలు చేసుకోవాలని సూచించారు.

Exit mobile version