World Happiness Report : డబ్బును ఆనందంకు కొలమానంగా చూడలేం. ఎంత డబ్బు ఉన్నా, అష్ట ఐశ్వర్యాలు ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థం. కోట్లాది రూపాయల సంపద, నగలు, ఇల్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ కూడా సంతోషాన్ని ఇచ్చేవేనా. ఇవన్నీ కేవలం కంఫర్ట్స్ మాత్రమే. ఇవన్నీ నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవని ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ తేల్చేసింది. తలసరి డీజీపీ, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, ఆరోగ్యం, అవినీతి, వ్యక్తుల జీవన స్థితిగతుల ఆధారంగా ఐక్యరాజ్య సమితి రూపొందించిన జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది.
మొత్తం 150 దేశాలపై చేసిన సర్వేలో భారత్ 126వ స్థానంలో ఉండడం కొంత విచారం కలిగించేదే. ఫస్ట్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉండగా.. రెండు డెన్మార్క్, మూడు ఐస్ లాండ్ ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా కన్నా పాకిస్తాన్, నేపాల్, చైనా మెరుగ్గా ఉండడం విశేషం.
ఐక్యరాజ్య సమితి మొత్తం 143 దేశాలపై అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా.. అఫ్గనిస్తాన్ చిట్ట చివరి స్థానంలో ఉంది. ఈ సర్వేలో మొదటి సారిగా అమెరికా, జర్మనీ చేరగా.. అమెరికా 23, జర్మనీ 24 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 20లో కువైట్ 12వ స్థానం, కోస్టారికా 13వ స్థానంలో ఉండగా.. హమాస్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ 5వ స్థానంలో ఉండడం గమనార్హం. టాప్ టెన్ లో ఉన్న దేశాల్లో నెదర్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే 15 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉండగా, అందులో కెనడా, బ్రిటన్లు 30 మిలియన్లకు పైగా జనాభాతో ఉన్నాయి.
ఆఫ్గనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ లో 2006 నుంచి 10 మధ్య హ్యాపీనెస్ లో తీవ్ర క్షీణత , సెర్బియా, బల్గేరియా, లాట్వియా కు చెందిన తూర్పు యూరోపియన్ దేశాలు పెరుగుదలను నమోదు చేశాయి.
అయితే, ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేందుకు గల కారణాలను ఆ దేశంలోని టాప్ యూనివర్సిటీ హెల్సింకీ కొన్ని విషయాలను వెల్లడించింది. అందులో ఫిన్లాండ్ ప్రజలు ప్రకృతికి దగ్గరగా ఉంటారు. ఆరోగ్యకరమైన పని విధానం ఈ రెండే ప్రధాన కారణమని చెప్తున్నారు.
సంతోషకరమైన టాప్ 20 దేశాలు
01. ఫిన్లాండ్
02. డెన్మార్క్
03. ఐస్లాండ్
04. స్వీడన్
05. ఇజ్రాయెల్
06. నెదర్లాండ్
07. నార్వే
08. లాక్సెంబర్గ్
09. స్విట్జర్ లాండ్
10. ఆస్ట్రేలియా
11. న్యూజిలాండ్
12. కోస్టారికా
13. కువైట్
14. ఆస్ట్రియా
15. కెనెడా
16. బెల్జియం
17. ఐర్లాండ్
18. చెకియా
19. లిథువేనియా
20. బ్రిటన్