Indian women Very Strong : ఒకప్పుడు ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్లు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు సైతం మారుతూ వస్తున్నారు. మగవాళ్ళకు ధీటుగా తమేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే మగవాళ్ళకంటే వాళ్ళే అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో..
ఒంటి చేత్తే ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు ఉద్యోగంలోనూ పురుషుడిగా ధీటుగా పని చేస్తూ మహిళలు శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే కొన్ని రంగాల్లో ఇప్పటికీ పురుషుల హవానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్మీ, నేవీ, పైలెట్, పోలీస్, సెక్యూరిటీ, ఎమర్జెన్సీ రంగాల్లో పురుషుల ఆధిక్యం కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్టమైన రంగాల్లో మహిళలు ప్రవేశిస్తూ రాణిస్తుండటం చూస్తుంటే ముచ్చటేయక మానదు.
భారత్ లో మహిళలు ఇంకా సంప్రదాయ ఉద్యోగాలు చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అయితే కొందరు మాత్రం క్లిష్టమైన రంగాలను ఎంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్పీజీ( స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)లో ఉద్యోగం సాధించేందుకు పురుషులే నానా తంటాలు పడుతుంటారు. అలాంటి ఓ కొందరు మహిళలు ఎస్పీజీలో ఉద్యోగాలు సాధించడమే కాకుండా భారత ప్రధానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ఎస్పీజీకి ఓ మహిళ నేతృత్వం వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీనిని చూస్తుంటే మోదీ హయాంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై మీ అభిప్రాయమెంటో కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి.