Indian Student Death In US : అమెరికా రోడ్డు ప్రమాదానికి మరో భారత విద్యార్థిని బలి

Indian Student Dead In US
Indian Student Death In US : అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని మరణించిన ఘటన కనుల నుంచి దూరం కాక ముందే.. మరో విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన మరువకముందే మరో విద్యార్థిని రోడ్డు కాటుకు బలైంది. యూఎస్ లో ఆదివారం (నవంబర్ 12) జరిగిన ప్రమాదంలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని మరణించింది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సిరోలు మండలం, కంపెల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్యకు కూతురు నీరజ (28) ఉంది. పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో మమత మెడికల్ కాలేజ్ లో బీడీఎస్ ను పూర్తి చేసుకుంది. పైచదువుల కోసం అమెరికాలోని మెస్సోరీకి వెళ్లింది. అక్కడ లుయీస్ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరింది. స్థానికంగానే ఉంటూనే చదువుకుంటోంది.
గత నెల (అక్టోబర్) 28వ తేదీ మార్కెట్ కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆమె మృదేతహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తరలించారు. శనివారం రాత్రి వరంగల్ కు చేరుకున్న మృతదేహాన్ని ఆదివారం సొంత గ్రామం కంపెల్లికి తరలించారు. డాక్టర్ అయి తిరిగి వస్తుంది అనుకున్న కూతురు విగత జీవిగా రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. అదే రోజు అంత్య క్రియలు నిర్వహించారు.
మొదట జిల్లేడు చెట్టుతో ఆమె మృతదేహానికి వివాహం జరిపించారు. అంత్యక్రియల విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం నీరజ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.