Indian Railways : ‘చుకు చుకు రైలు వచ్చింది.. దూరం దూరం జరగండి.. ఆగినాక ఎక్కండి..’ బాల్యంలో ప్రతీ ఒక్కరూ ఈ పాట వినే ఉంటారు. అన్ని ప్రయాణాల్లో కెళ్లా రైలు ప్రయాణం అనేది చాలా మెమొరీస్ ను నింపుతుంది అనడంలో సందేహం లేదు. దీనికి తోడు ప్రతీ పేద వాడు ఎక్కువ దూరం ప్రయాణం సాగించాలంటే రైలు ఉండాల్సిందే. ఇక బాల్యంలో రైలు ప్రయాణం గురించి పాఠ్యాంశంలో చదువుకున్నాం కదా.. అలాంటి రైలు గురించి పూర్తిగా తెలుసుకుందా..
భారత రైల్వే ప్రారంభమైంది బ్రిటీష్ కాలంలో 171 సంవత్సరాల క్రితం 1853, ఏప్రిల్ 16వ తేదీ తొలి రైలు 400 మంది ప్రయాణికులతో ‘బొంబాయి టు థానే’ దూరం తక్కువే (34 కిమీ)..! కాని, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టింది. మహావ్యవస్థకు నుడికారం తెచ్చింది. కూ కూ బండి అయింది సువిశాల భారతావని ప్రగతి రథం..! ఈడేరిన భారతీయుల మనోరథం..!
ఒకనాటి పొగబండి.. డీజిల్ ఇంజిన్ గా మారి.. విద్యుత్ పెరిగి రైలుగా ఎదిగి.. జోరు పెరిగి.. బుల్లెట్ ట్రైనుగా అందుకుంది జోరు..! భారతీయ రైల్వేకి జోహారు..! నీ..నా..మనందరి బండి..!
అదో సరదా.. రైలు ప్రయాణం..! చిన్ననాటి అనుభూతి.. అమ్మతో..నాన్నతో యాత్ర..! అప్పర్ బెర్తు.. అదెంత వర్తు..! కారు.. విమానం.. వీటిని మించి థ్రిల్లు..! ఆ జ్ఞాపకాలు నెమరేసుకంటే
అదో జిల్లు..!
మొత్తానికి 400 మందితో మొదలైన ప్రస్థానం..! రోజుకు 2.40 కోట్ల ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తూ.. ఏటా ప్రపంచాన్నే తిప్పేస్తూ..! భూగోళం చుట్టేస్తూ..! జగతిలోనే అత్యంత భారీ వ్యవస్థగా ఏర్పడింది. 7500 స్టేషన్లు..! 2.40 లక్షల వ్యాగన్లు..! 69000 కోచ్ లు..! 9000 ఇంజిన్లు..! 13.50 లక్షల ఉద్యోగులు..! ప్యాసింజర్.. గూడ్స్ రైళ్లు..! లోకల్..బుల్లెట్..! వందే భారత్.. ! మహాన్ హై మేరీ భారత్..! అదిరిపోయే రైళ్ల బారాత్..!
అతి పెద్ద స్టేషన్ పేరు.. వెంకట నరసింహరాజు వారి పేట (Venkata Narasimha Rajuvaripet Railway Station)..!
బుల్లి నామం.. ఎల్బీ స్టేషన్..! రెండింటికీ మధ్య దూరం 4273 కి. మీ..! అదే బండి.. డిబ్రుగర్ నుంచి కన్యాకుమారి..! నాలుగు రోజుల ప్రయాణం..! ఎక్కితే కళ్లకు కట్టినట్లు భారతీయ పురాణం భారతీయ పురాణం..! నాలుగు పొద్దుల పలకరించే తొలి కిరణం..! మూడు రాత్రులు జాబిల్లితో ప్రేమాయణం..!
సామాన్యుని ప్రయాణ సాధనం..! గాంధీ గారి పెట్టెలు..! ఇప్పటికీ సాధారణ రైలు కిటకిటనే..! ఉద్యోగులకు అప్ అండ్ డౌన్ కటకట..! కంప్లయింట్ల నమోదుకు టోల్ ఫ్రీ..! ఎంపీలకు జీవితకాలం ఫ్రీ..! ఉద్యోగులకు పాసులు..! ప్రేమికులకు టైం పాసులు..! అక్కడే కుదిరిరిపోయే పెళ్లిళ్లు..! మారిపోయే కొన్ని బతుకు చిత్రాలు..! కొందరి జీవితాల్లో చైత్రాలు..! మొత్తంగా.. రైలు.. భారతీయ సంస్కృతీ సింబల్..! ప్రపంచ రైల్వేలకు భారతీయ రైలు బాహుబలి..!