PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ అధికార పగ్గాలు చేత పట్టారు. భారతీయ జనతా పార్టీ నుంచి మూడు దఫాలుగా ప్రధాన మంత్రి భాద్యతలు చేపట్టింది మోదీ ఒక్కరే కావడం విశేషం. 2014 నుంచి వరుసగా ఓటమి ఎరుగకుండా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు అదేవిదంగా మూడు సార్లు వరుసగా తాను ప్రధాన మంత్రి గా ఎంపిక కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రధాని కూడా వరుసగా వాళ్ళ దేశాల్లో రెండు లేదా అంత కంటే ఎక్కువ సార్లు ప్రధాన మంత్రి భాద్యతలు చేపట్టింది లేదు. మోదీ ఒక్కరే వరుసగా ప్రధాన మంత్రి అవుతున్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు పలు దేశాల ప్రధాన మంత్రులు భాద్యతలు ఎందరు చేపట్టారో ఈ విదంగా ఉంది. యూకే లో ఐదుగురు ప్రధాన మంత్రులు అయ్యారు. ఇందులో ఏ ఒక్కరు కూడా వరుసగా విజయం సాధించలేదు. ఇటలీలో కూడా ఐదుగురు ప్రధాన మంత్రులు మారారు. అక్కడ కూడా వరుస విజయాన్ని ఎవరు కూడా అందుకోలేదు. ఇటలీలో కూడా ఇప్పటి వరకు ఐదుగురు ప్రధాన మంత్రులు అధికారంలో కొనసాగారు. ఆ దేశంలో కూడా వరుస విజయాన్ని చేరుకోలేక పోయారు. యూఎస్ఏ లో కూడా 2014 నుంచి 2024 వరకు కూడా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన మంత్రులు భాద్యతలు చేపట్టినా, అందులో ఒక్కరు కూడా వరుసగా అధికారం దక్కించుకోలేదు. జపాన్ లో ముగ్గురు ప్రధాన మంత్రులు భాద్యతలు చేపట్టారు. వారిలో ఏ ఒక్కరు కూడా వరుసగా అధికారంలోకి రాలేదు.
ఆస్ట్రేలియా లో కూడా నలుగురు ప్రధాన మంత్రులు గడిచిన పదేళ్ల కాలంలో మారారు. ఆ దేశంలో నలుగురిలో ఏ ఒక్కరు కూడా వరుసగా దేశం భాద్యతలు చేపట్టక పోవడం విశేషం. భారతీయ జనతా పార్టీ అందివచ్చిన అవకాశాలను వెంట, వెంట సద్వినియోగం చేసుకుంటుంది. 2019 లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది. అయినా మిత్ర పక్షాలను మిత్రపక్షాలను దూరం చేసుకోలేదు. పార్టీకి, మిత్రుల మధ్య తేడా లేకుండా ప్రధాన మంత్రి హోదాలో మోదీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడంతోనే వరుస విజయాలను అందుకున్నాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం.