Google : గూగుల్‌పై భారత ప్రభుత్వం మరోసారి సీరియస్

Google

Google

Google : ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజ సంస్థ ‘బైజూస్’కు ఆర్థిక కష్టం వచ్చింది. సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించలేకపోతున్నానని సీఈఓ బైజూ రవీంద్రన్ ఇటీవల ఒక లేఖ ద్వారా చెప్పారు. ఇన్వెస్టర్లు వారి స్వ ప్రయోజనాల కోసం నిధులను లాక్ చేశారని ఉద్యోగులకు వివరించాడు.

ఈ నెల 10వ తేదీ నాటికి వేతనాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు కొందరు ఇన్వెస్టర్లతో ఈ పరిస్థితి ఎదురైంది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకున్నా.. ఇన్వెస్టర్ల తీరుతో వేతనం చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. బైజూస్‌ పెట్టుబడుల ద్వారా గణనీయ లాభాలు పొందారు. ఒకరు తమ పెట్టుబడికి 8రెట్లు లాభం ఆర్జించారు. అటువంటి వారు కూడా ఇతరుల జీవితాలు, జీవనోపాధితో ఆటలాడుకోవాలని అనుకుంటున్నారు.’ అని రవీంద్రన్ ఆరోపించారు.

సర్వీస్ ఫీజు చెల్లించలేదని కారణంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి యాప్స్ తొలగించడం సరి కాదని కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి అశ్వినీ శ్రీవైష్ణవ్ గూగుల్ పై అసహనం వ్యక్తం చేశారు. టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీల యాప్స్‌ను ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. దీనిపై వచ్చేవారం సమావేశం నిర్వహిస్తామని అశ్వినీ వైష్ణవ్.. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ ఎకో గుండె వంటిదని. అటువంటి సంస్థల తల రాతను ప్రధాన టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించవద్దని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి చెప్పారు.

స్టార్టప్, టెక్ కంపెనీల యాప్స్ తొలగించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. స్టార్టప్ సంస్థలకు రక్షణ కల్పించడం ముఖ్యమని అందుకే గూగుల్, యాప్ డెవలపర్లతో వచ్చే వారం సమావేశం అవుతామన్నారు. దేశంలో లక్ష స్టార్టప్ సంస్థలు , 100 యూనికార్న్‌లు అవతరించాయని వైష్ణవ్ తెలిపారు.

TAGS