Salman Khan – Rajinikanth : షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మెగా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అట్లీ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నట్లు సినీ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో చర్చలు కూడా జరిపినట్లు టాక్. ఈ మాస్ యాక్షన్ మూవీ కోసం ఇద్దరు హీరోలు కావాలని, సల్మాన్ ఖాన్ తో పాటు సౌత్ నుంచి ఓ పెద్ద స్టార్ ను తీసుకోవాలని అట్లీ చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం సౌత్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అట్లీ దర్శకత్వంలో రజినీకాంత్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ డీల్ ను క్లోజ్ చేసేందుకు అట్లీ, సల్మాన్ ఖాన్, రజినీకాంత్ వచ్చే నెలలో కలువబోతున్నారని చర్చ జరుగుతోంది.
సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, సూపర్ స్టార్ రజినీకాంత్ తో తమకు కుటుంబ బంధం ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరోవైపు అట్లీ రెండేళ్లుగా సల్మాన్ ఖాన్ తో టచ్ లో ఉన్నాడు. రజినీకాంత్, సల్మాన్ ఖాన్ ఇద్దరినీ రంగంలోకి దింపుతామని ధీమా వ్యక్తం చేశారు.
సికిందర్ పూర్తయిన తర్వాత సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులోనే నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ కనగరాజ్ తో కలిసి కూలీ చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత నార్త్, సౌత్ స్టార్లు కలిసి అట్లీ ప్రాజెక్టుకు రాబోతున్నారట. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అట్లీ కూడా అనుకుంటున్నారు. అట్లీ నిజంగానే సల్మాన్, రజినీకాంత్ ను రంగంలోకి దింపితే.. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే భారీ కాస్టింగ్ చిత్రం అవుతుంది.
గతంలో అట్లీ షారుఖ్ ఖాన్, దళపతి విజయ్ లతో కలిసి ఓ స్క్రిప్ట్ వర్క్ గురించి పలుమార్లు మాట్లాడాడు. ఒకవేళ సల్మాన్ ఖాన్ వర్సెస్ రజినీకాంత్ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలు నిజమైతే షారుక్ వర్సెస్ విజయ్ కలయిక జరగడానికి అభిమానులు చాలా కాలం వేచి చూడక తప్పదు.