Indian Bowlers : రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు అలౌట్ అయ్యింది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు 126 పరుగుల లీడ్ వచ్చింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ వచ్చారు.
కాగా, రెండో సెషన్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. సెషన్ ప్రారంభమైన 10 ఓవర్లలోపే ఇంగ్లాండ్ ను అలౌట్ చేశారు. 290/5 స్కోర్ తో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 319 పరుగులకే అలౌట అయ్యింది. 29 పరుగుల్లోనే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, కుల్ దీప్ 2, జడేజా 2, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 126 పరుగుల ఆధిక్యం సాధించింది.
వికెట్ల వేటలో భాగంగా భారత బౌలర్లు వరుసగా రెండు బంతులకు రెండు వికెట్లు తీశారు. 64.6 వద్ద బెన్ స్టోక్స్ ఔటవగా, 65.1 వద్ద బెన్ ఫోక్స్ (13)ను సిరాజ్ ఔట్ చేశాడు. మిడాన్ లో ఉన్న రోహిత్ శర్మకు సులభమైన క్యాచ్ ఇచ్చి బెన్ ఫోక్స్ పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ టీమ్ మన బౌలర్లకు దాసోహమనక తప్పలేదు.
కాగా.. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి 5 ఓవర్లలో 15 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ 12, జైస్వాల్ 2 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 15/0(5ఓవర్లు).