IAF Record : అరుదైన రికార్డు సాధించిన భారత వాయిసేన..
IAF Record : భారతదేశ వాయు సేన అరుదైన ఘనతను సాధించింది సముద్రమట్టానికి 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్ పై C-130J ఎయిర్ క్రాఫ్ట్ ను రాత్రిపూట సురక్షితంగా ప్లానింగ్ చేసింది. ఇలా చేయడం ఇదే తొలిసారి. గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఈ విన్యాసాన్ని నిర్వహించింది. ఈ వీడియోను ఐఏఎఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
భారత దేశ సైన్యం అంటే ఇతర దేశాలకు వణుకు. గొప్ప సైన్యం కలిగిన దేశంగా భారత్ కు ఎంతో ఘనత ఉంది. శత్రువులను తిప్పికొట్టే అతిపెద్ద సైన్య వ్యవస్థ భారత దేశ సొంతo.. యుద్ధంలో శత్రు సైన్యాలను మట్టి కల్పించే విధంగా భారతదేశ సైన్యం పనిచేస్తుంది. తాజాగా భారత వాయుసేన అరుదైన రికార్డు సాధించడంతో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి హిమాలయ పర్వతాల పై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్ పై రాత్రి పూట ఎయిర్ క్రాఫ్ట్ లు లాంచ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి ఘనత సాధించిన వాయుసేనకు అభినందనలు వెల్లువెత్తు తున్నాయి.