India Vs South Africa:బంతిని తిప్పి స్వింగ్ చేయడంలో అశ్విన్ చాలా దిట్ట. అందుకే ఇప్పటికీ టెస్టుల్లో, వన్డే మ్యాచుల్లో మనోడికి ఎదురు లేకుండా పోతోంది. ఇప్పటికే తన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న అశ్విన్.. ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టెస్టు సిరీస్ లో భాగంగా టీమిండియా 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. రేపటి నుంచి అంటే డిసెంబర్ 26 నుంచే ఈ బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కాబోతోంది.
ఎలాగైనా సరే ఈ టెస్టు మ్యాచ్ గెలిచి టీమ్ ఇండియా సంచలనం సృష్టించాలని అనుకుంటోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఇప్పటి వరకు రెండు టీమ్ ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లను గమనిస్తే 42 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి ఇరు దేశాలు. అందులో భారత్ 15 మ్యాచ్ లను గెలుచుకోగా.. దక్షిణాఫ్రికా గెలిచింది 17 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇంకో 10 టెస్టు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.
ఇక దక్షిణాఫ్రికా గడ్డమీద టెస్టు రికార్డులను గమనిస్తే ఇప్పటి వరకు మొత్తం 23 టెస్టులు జరిగాయి. అందులో సౌతాఫ్రికా 12 మ్యాచ్ లలో విజయం సాధించింది. భారత్ కు కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే గెలిచి, మరో 7 మ్యాచ్ లను డ్రా చేసుకుంది. అయితే ఇప్పుడు జరగబోతున్న టెస్టు మ్యాచ్ లలో మరిన్ని రికార్డులు నమోదు కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా బౌలర్ అశ్విన్ కు ఇది అరుదైన టెస్టు మ్యాచ్ కాబోతుందని తెలుస్తోంది.
నంబర్ 1 టెస్ట్ బౌలర్ గా అశ్విన్ కు పేరుంది. ఇక అతను ఈ టెస్టు మ్యాచ్ సిరీస్ లతో 500 వికెట్ల క్లబ్ లో చేరబోతున్నారు. ఇప్పటి వరకు 94 టెస్టులాడిన అశ్విన్.. 489 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 34 సార్లు 5 వికెట్లు తీయడం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అశ్విన్.. ఇప్పుడు 500 వికెట్లకు కేవలం 11 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. అశ్విన్ దీన్ని 2 టెస్టు మ్యాచ్‌ల్లో సులభంగా సాధించగలడని నిపుణులు చెబుతున్నారు.
అంటే మరో 11 వికెట్లు గనక తీసేస్తే… 500 వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో మన ఇండియన్ స్పిన్నర్ చేరిపోతాడు. ఇప్పటి వరకు ఇండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన క్రికెటర్ గా అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఆయన 132 టెస్టు మ్యాచ్ లు ఆడి దాదాపు 619 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అతని తర్వాత స్థానంలో అశ్విన్ చేరబోతున్నాడు.