JAISW News Telugu

India Vs England : దుమ్మురేపుతున్న స్పిన్నర్లు..విలవిలలాడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు..

India Vs England match

India Vs England match

India Vs England : భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ప్రస్తుతం లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ 42 ఓవర్లలో 137 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు అద్దరగొట్టి 6 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

మ్యాచ్ జరిగిందిలా..
ఇంగ్లాండ్ ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డెకెట్ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్ ను బుమ్రా ప్రారంభించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడి 11 ఓవర్లకు 53 పరుగులు సాధించారు. ఇక ఆతర్వాత అశ్విన్ బౌలింగ్ లో తొలి వికెట్ పడింది. 11.5 ఓవర్ లో డకెట్ (35) ఎల్బీ అయ్యాడు.  14వ ఓవర్ లో జడేజా బౌలింగ్ లో ఓలీ పోప్(1) స్లిప్ లో రోహిత్ కు దొరికాడు. ఇక ఆ తర్వాతే బౌలింగ్ కు వచ్చిన అశ్విన్ 16వ ఓవర్ లో తొలి బంతికే ఓపెనర్ క్రాలే(20)ను ఔట్ చేశాడు. మిడాఫ్ లో సిరాజ్  అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 3వ వికెట్ నష్టపోయింది.  క్రాలే స్థానంలో వచ్చిన బెయిర్ స్టో , జో రూట్ కలిసి ఇన్నింగ్స్ ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. లంచ్ బ్రేక్ వరకూ క్రీజులో పాతుకుపోయారు.

అయితే ఆతర్వాత 32 ఓవర్ లో అక్షర్ పటేల్ వేసిన బంతికి బెయిర్ స్టో(37) ఔటయ్యాడు. ఫుల్ లెన్త్ డెలివరీ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. దీంతో 121 పరుగుల వద్ద ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్ (29)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. 35వ ఓవర్ లో జడ్డూ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయాడు. షార్ట్ ఫైన్ లెగ్ లో బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో క్రీజులో పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్ పెవిలియన్ చేరుకోవడం గమనార్హం. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఫోక్స్ ఔటయ్యాడు.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ ఫోక్స్, రెహాన్, టామ్ హార్టీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

Exit mobile version