India Vs Canada : ఇండియా, కెనడా మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ గ్రౌండ్ తడిగా ఉండటంతో రద్దయింది. మ్యాచ్ జరగాల్సిన ఫ్లోరిడాలోని స్టేడియంలో రెండు రోజులు భారీ వర్షం కురిసింది. దీంతో అవుట్ ఫీల్డ్ పూర్తిగా వెట్ గా మారిపోయింది. దీంతో శనివారం రాత్రి 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ ముందుగా ఆలస్యం అవుతుందని అనౌన్స్ మెంట్ ఇచ్చినా గ్రౌండ్ మొత్తం ఎంత ట్రై చేసినా డ్రై కాకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
దీంతో ఇండియా మూడు మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే గెలిచి గ్రూపు లో టాప్ లో నిలవడంతో సూపర్ 8 కు అర్హత సాధించింది. కెనడా ఐర్లాండ్ పై ఒక మ్యాచ్ గెలవగా.. యూఎస్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. గ్రూప్ ఏ పాకిస్థాన్ టీం యూఎస్ఏ, ఇండియాపై ఓడిపోగా.. కెనడాపై గెలిచింది. దీంతో సూపర్ 8కు అర్హత సాధించకుండానే ఇంటి బాట పట్టింది. దీంతో పాకిస్థాన్ మాజీలు టీం కూర్పుపై మండిపడుతున్నారు. ఆజం ఖాన్ తో సహా సగం టీంను ఇంటి బాట పట్టించాల్సిందే అంటూ పీసీబీ సెలక్టర్లపై గుర్రు మీద ఉన్నారు.
ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఇప్పటికే అనేక సంచనాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి మేటి జట్లు టోర్నీ నుంచి వైదొలగగా.. ఇంగ్లండ్ చివరి మ్యాచ్ లో నమీబియాపై భారీ తేడాతో గెలిస్తేనే సూపర్ 8కు వెళ్లే అవకాశం ఉంది.
ఇండియా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ జట్లు సూపర్ 8 కు చేరుకోగా.. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ లు సూపర్ 8 బెర్త్ కోసం ఇంకా పోరాటం చేస్తున్నాయి. ఇండియా 24 వ తేదీన ఆస్ట్రేలియాతో సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. మొత్తం మీద ఈ సారి చిన్న జట్లయిన యూఎస్ఏ, అఫ్గానిస్తాన్ లు సూపర్ 8 చేరుకోవడంతో పోటీ కూడా రసవత్తరంగా మారిపోయింది.