India Team : టీ 20 విజయాల్లో ఇండియాదే అగ్రస్థానం
India Team : టీం ఇండియా యువ జట్టు జింబాబ్వే పై మూడో టీ 20లో విక్టరీ సాధించడంతో పాటు.. ప్రపంచంలోనే అత్యధిక టీ 20 మ్యాచ్ లు గెలిచిన జట్టుగా రికార్డు తన పేరిట లిఖించుకుంది. దీంతో సిరీస్ లో 2-1 తో ముందంజ వేసింది. జింబాబ్వే తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇండియాకు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ మంచి ఆరంభం ఇచ్చారు. ఫామ్ అందుకున్న గిల్ ఏడు ఫోర్లు మూడు సిక్సులతో 66 పరుగులు చేశాడు.
అయితే జింబాబ్వే 159 పరుగులకే పరిమితం కావడంతో టీం ఇండియా విజయం సాధించింది. దీంతో ఇండియా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ 20 మ్యాచ్ లో 150వ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు 230 టీ 20 మ్యాచులు ఆడిన టీం ఇండియా 150 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ 245 మ్యాచులాడి 142 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తర్వాత ప్లేస్ లలో న్యూజిలాండ్ 111, ఆస్ట్రేలియా 105, దక్షిణాఫ్రికా 104 మ్యాచుల్లో గెలిచి టాప్ 5 లో కొనసాగుతున్నాయి.
టీ 20 క్రికెట్ లో ఆధిపత్యం టీం ఇండియాదే అని అర్థమవుతుంది. రెండు సార్లు టీ 20 ప్రపంచ కప్ లో విజేత నిలిచిన టీం ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఈ రెండు జట్లు కూడా రెండు సార్లు టీ 20 ప్రపంచ కప్ నెగ్గిన జట్లుగా ఉన్నాయి.
మూడో టీ 20 కోసం జట్టులో మార్పులు చేశారు. యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబెలను తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా హర్షిత్ రాణా, జితేశ్ శర్మ, సాయి సుదర్శన్ లను పక్కన పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ లో ఆడిన ఈ ముగ్గురు ప్లేయర్లు జింబాబ్వే రావడానికి టైం పట్టింది. అందుకే వీరి ప్లేస్ యువ క్రికెటర్లను తీసుకున్నారు.