Maldives High Commission : భారత్ ప్రధాని నరేంద్రమోడీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యల వేడి తగ్గడం లేదు. మాల్దీవులను ఇప్పటికే బ్యాన్ అంటూ భారతీయులు నిషేధించి అక్కడికి టూరిజం బంద్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ ప్రభుత్వం కూడా మాల్దీవుల పని పట్టడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు మాల్దీవులపై సీరియస్ గా స్పందిస్తోంది.
భారత్ లోని మాల్దీవ్ హైకమిషనర్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రతిగా మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన భారత్.. వెంటనే మల్దీవుల హైకమిషనర్ ను రప్పించి చుక్కలు చూపించింది.
కనీసం మూడు నిమిషాలు కూడా అతడిని కార్యాలయంలో ఉంచకుండా నిలబడే భారత అధికారులు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశారు. భారత్ తో పెట్టుకుంటే మాల్దీవుల మరో శ్రీలంక అవుతుందని.. అడుక్కుతింటారంటూ హెచ్చరించి పంపించేశారు.
ఇక సామాజికంగా ఆర్థికంగా మల్దీవులపై ఆంక్షలతో ఒత్తిడి తేవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే భారతీయులంతా మల్దీవుల టూర్లను రద్దు చేస్తున్నాయి. ఎయిర్ సంస్థలు మల్దీవుల టికెట్లను బ్లాక్ చేశాయి. అక్కడికి విమానాలు నడపకుండా బ్యాన్ చేశాయి. దీంతో ఇప్పుడు మల్దీవులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.