India : చైనా వేల కోట్ల డీల్ కు నో చెప్పిన భారత్.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!

India said no to China's deal

India said no to China’s deal

India : ఒకప్పటి భారత్ వేరు.. ప్రస్తుత భారత్ వేరు..అప్పట్లో పొరుగు దేశాలు పాక్, చైనా కయ్యానికి కాలుదువ్వేవి. పాక్ ను ఎన్నో సార్లు చితక్కొట్టిన..చైనా ప్రోద్బలంతో మనపైకి వచ్చేది. ఇక గత పదేళ్లలో పాక్ మనపైకి రావాలంటేనే వణికిపోతోంది. ఇక చైనా గల్వాన్ లోయలో, అరుణాచల్ ప్రదేశ్ లో ఉద్రిక్తతలు సృష్టించి మన దేశాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటుంది. మన దేశంతో పెట్టుకుంటే గతంలో వలె కాదు..ఇప్పుడైతే చిత్తడి అయిపోతుందని చైనాకు బాగా తెలుసు. అందుకే పరోక్షంగా మనపై అక్కసు తీర్చుకోవాలని అనుకుంటుంది. అయినా కూడా ప్రస్తుతం అత్యంత విశ్వసనీయ దేశంగా భారత్ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా తళుకులీనుతోంది. చైనా ఓ అపనమ్మకమైన దేశమని అన్ని దేశాలకు అర్థమైపోయింది.

వాస్తవానికి చైనాకు అతిపెద్ద దిగుమతిదారు భారత్. చైనా వస్తువులు లేని ఇల్లు భారత్ లో ఉండదని అంటారు. పిన్నీస్ నుంచి మొదలు ఫర్టిలైజర్ వరకు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతుంటాయి. భారత్ లో పేద, మధ్యతరగతి జనాభా ఎక్కువ. వీరి ఆదాయం అతి తక్కువ కావడంతో చైనాలో తయారయ్యే చౌక వస్తువులకు భారత్ లో ఫుల్ డిమాండ్ ఉండేది. అయితే నాసిరకంగా ఉన్నప్పటికీ చౌకగా వస్తుండడంతో వాటిని కొనేవారు. దీంతో భారత్ మార్కెట్ ద్వారా లక్షల కోట్ల ఆదాయం ఆర్జించేది.

భారత్ తో ఇంతటి ప్రయోజనం ఉన్నా.. చైనా తన దుర్బుద్ధిని చాటుకునేది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక చైనా నుంచి దిగుమతులను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. ‘మేకిన్ ఇండియా’ పేరుతో దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. దీంతో చైనా నుంచి దిగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. మొన్న నవంబర్ లో దీపావళి పండుగ సందర్భంగా చైనా బాణసంచాను బ్యాన్ చేయడంతో ఆ దేశాన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. ఇలా ఒక్కొక్కటిగా చైనా దిగుమతులపై భారత్ దెబ్బకొట్టుకుంటూ వస్తోంది.

తాజాగా భారత్ లో ఉన్న ‘ఐరన్ వోర్’ పై చైనా కన్నేసింది. చైనా తన అవసరాలు, వివిధ దేశాల్లో ఏర్పాటు చేయబోయే కంపెనీల అవసరాల కోసం మన ఐరన్ వోర్ కావాలని హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) అధికారులను చైనా సంప్రదించింది. తమ దేశానికి ఐరన్ వోర్ దిగుమతి చేయాలని కోరింది. అయితే దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అంది. మా ఐరన్ వోర్ ను ఎవరికీ ఇచ్చేది లేదని.. చెప్పుతో కొట్టినట్టు చెప్పేసింది. వేల కోట్ల డీల్ ను
తృణప్రాయంగా వదులుకుంది.

చైనాకు ఐరన్ వోర్ ను పంపిస్తే ఆ దేశం మరింత లాభపడి..మన దేశంపై కుట్రలు చేస్తుందనే విషయం తెలిసే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ క్రమేణా బలపడుతుంటే.. చైనా ఆర్థిక వ్యవస్థ పతనం వైపు వెళ్తోంది. అయినా ఇవన్నీ బయటకు కనపడకుండా చైనా ప్రపంచ దేశాలతో అంతా బాగున్నట్టు నటిస్తోంది. ఏదో రోజు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మాత్రం ఖాయం.

TAGS