JAISW News Telugu

India Vs Australia : సూపర్ 8కు భారత్ అర్హత.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఎప్పుడంటే..

India Vs Australia

India Vs Australia

India Vs Australia : టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా అద్భుతంగా ఆడి సూపర్ 8 కు అర్హత సాధించింది. ఇప్పటికే సిరీస్ లో ఆస్ట్రేలియా, భారత్ , దక్షిణాఫ్రికా సూపర్ 8 కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్, నెదర్లాండ్ లలో ఏదో ఒకటి సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇటు వెస్టిండీస్, అప్గాన్ జట్లు రెండు కూడా సూపర్ 8 లో పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్ వెస్టిండీస్ పై ఓడిపోవడంతో సూపర్ 8 దారులు మూసుకుపోయాయి.

న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్ పై కూడా ఓడిపోవడంతో ఈ సారి వరల్డ్ కప్ లో ఇంటి బాట పట్టే పెద్ద జట్లలో కివీస్  ఉండటం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లో స్కోరింగ్ నమోదవుతున్న పిచ్ లపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.  ఈ సిరీస్ లో ఇప్పటికే చిన్న జట్లు  సంచనాల విజయాలు నమోదు చేసుకున్నాయి.  

యూఎస్ఏ, తన కంటే బలమైన జట్టు పాకిస్థాన్ పై సూపర్ ఓవర్ లో గెలిచి సంచలన విజయం నమోదు చేసుకుంది. ఐర్లాండ్ పై కెనడా సంచలన విజయంతో గ్రూపు వన్ లో రెండు సంచలన విజయాలు నమోదయ్యాయి. అటు వెస్టిండీస్ పై పపువా న్యూ గినియా అద్బుత పోరాటం చేసి ఓడిపోయింది. న్యూజిలాండ్ పై అఫ్గాన్ టీం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది.

శ్రీలంక బంగ్లాదేశ్ పై ఓడిపోయి ఘోర ఓటమిని మూట గట్టుకుంది. శ్రీలంక బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో సౌతాఫ్రికాపై ఓడిపోగా.. బంగ్లాదేశ్ పై ఓటిమితో టోర్నీ నుంచి వైదొలిగిన జట్టుగా దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూపు ఏ లో టాప్ ప్లేస్ లో ఉన్న భారత్, గ్రూపు బిలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జూన్ 24 న జరగనుంది. మిగతా జట్లు కూడా తేలిపోతే జూన్ 20న వెస్టిండీస్ లేదా అఫ్గానిస్తాన్, 22 బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్ జట్లు భారత్ తో తలపడనున్నాయి.

Exit mobile version