India Weather Alert : భగ్గు మంటున్న భారతదేశం..ఈ రాష్ట్రాల వాళ్లకు హై అలెర్ట్
India Weather Alert : దేశంలో ఎండల ప్రభావం పెరుగుతోంది. భానుడు భగభగమంటున్నాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో 50 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50 నుంచి 55 డిగ్రీలు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీలు నమోదయ్యే ప్రమాదం ఉంది.
ఎండల ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీళ్లు తరచుగా తాగుతుండాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పళ్ల రసాలు, కొబ్బరి బొండాలు తాగడం సురక్షితం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వడదెబ్బ సోకే ప్రమాదం ఉన్నందున ఎండల్లో పనిచేయడం అంత మంచిది కాదు. తప్పనిసరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు ఏదైనా బట్ట కట్టుకోవాలి. ఎండ దెబ్బ సోకకుండా చూసుకోవాలి. వడదెబ్బ తాకితే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి. వేపుళ్లు కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇలా ఎండల బారి నుంచి రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎండల ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. వడదెబ్బ సోకితే ప్రాణాలే పోవచ్చు. దీని నుంచి రక్షించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకోవాలి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. ప్రజలు ఎండల బారిన పడకుండా చూసుకునేందుకు ప్రయత్నించాలి.
ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందే. కాటన్ దుస్తులు ధరిస్తే ఎండ బారి నుంచి రక్షణగా ఉంటుంది. వదులుగా ఉండే వాటిని వేసుకుంటే మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బ సోకకుండా చూసుకోవాలి.