Venkaiah Naidu : ప్రపంచ ఆహార మార్కెట్ లో భారత్ దూసుకుపోతోంది – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu : ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్ లో భారత్ దూసుకుపోతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశీయ ఆహారధాన్యాల ఉత్పత్తి 10% పెరగడం మన దేశ సత్తాను చాటుతోందన్నారు. బుధవారం ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలోని ఆడిటోరియంలో నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (నాస్) వార్షికోత్సవం సందర్భంగా భారతరత్న స్వామినాథన్ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా దేశంలో హరిత విప్లవానికి స్వామినాథన్ చేసిన కృషిని కొనియాడారు. ‘‘ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ దార్శనికత వల్లే వ్యవసాయరంగం భారత సామాజిక ఆర్థికాభివృద్ధికి ఎంతో చేయూత ఇవ్వగలిగింది. ప్రస్తుతం దేశం ఆహార భద్రతతో పాటు, పోషకాహార భద్రత సాధించే దిశగా పయనిస్తోంది. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశీయంగా ఆహారధాన్యాల ఉత్పత్తి 298 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ ఆహార మార్కెట్ లో భారత్ విస్తృతి పెరిగింది. బాస్మతీ, నాన్ బాస్మతీ బియ్యం, సుగంధ ద్రవ్యాలు, రొయ్యల ఎగుమతుల్లో దూసుకుపోతోంది. ఈ రంగంలె వాణిజ్య మిగులు ఉండడం మనం సాధించిన విజయానికి అద్దం పడుతోంది. దివంగత ప్రొఫెసర్ స్వామినాథన్ ఈ రంగానికి చేసిన అనిర్వచనీయమైన సేవలే మనం ఇంత బలంగా తయారు కావడానికి కారణం’’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

TAGS