Maldives : మాల్దీవుల తిక్క కుదిర్చిన భారత్.. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ లేక విలవిల..

Maldives

Maldives

Maldives : మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఓ చిన్న దేశం. తిప్పికొడితే మన దగ్గరి చిన్న నగరమంతా జనాభా కూడా ఉండదు. కాకపోతే మంచి పర్యాటక దేశం. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకమే ప్రధాన ఆదాయం కాబట్టి వివిధ ప్యాకేజీలతో ప్రపంచ పర్యాటకులకు తన దేశానికి రప్పించుకుని తద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది.

మొన్నటిదాక మాల్దీవుల దేశానికి భారతే పెద్ద అండ. టూరిస్టుల పరంగా మనవాళ్లే అక్కడికి ఎక్కువగా వెళతారు. మన దేశం వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం మన దేశానికి, ముఖ్యంగా తీర ప్రాంత భద్రతకు ఎంతో కీలకం. ఎంతో వ్యూహత్మకమైంది. అలాగే చుట్టుపక్కల దేశాలతో సయోధ్య పాటించడంలో మన దేశం ముందుంటుంది. చుట్టపక్కల దేశాలకు ఏ ఆపద వచ్చినా ముందుగా స్పందిస్తుంది.

ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల మొయిజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్  వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారు. మన శత్రు దేశమైన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టుపెడుతున్నారు. ఈ కుట్రను ముందే గమనించిన భారత్.. మాల్దీవులకు చెక్ పెట్టడానికి లక్షద్వీప్ ను ప్రమోట్ చేసే పనిలో పడింది. ఇక అక్కడ్నుంచి రెండు దేశాల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి.

అయితే ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా.. బొక్క ఆకుకే అన్నట్టుగా మన దేశంలోని చిన్న పట్టణం స్థాయి మాల్దీవులు.. మన దేశంపైకే తొడలు కొడితే మన పాలకులు ఊరుకుంటారా? ఆ దేశానికి వీలు చిక్కినప్పుడల్లా బుద్ధిచెప్తోంది. ఆ దేశ ప్రజలపై ఎవరికీ కోపం లేకున్నా.. అక్కడి అధ్యక్షుడికి బుద్ధి చెప్పేపనిలో మన సర్కార్ పడింది.

తాజాగా ఆ దేశానికి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కోడిగుడ్ల వంటి నిత్యావసర సరకుల ఎగుమతిని నిలిపివేసింది. దీంతో ద్వీపదేశమైన మాల్దీవులు విలవిలలాడిపోతోంది. ఈ నిత్యావసరాలను రష్యాకు ఎగుమతి చేస్తూ అక్కడి నుంచి చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల భారత్ కే విపరీతమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆ దేశ అధ్యక్షుడు ఇలాగే వ్యవహరిస్తే.. ఆ దేశం పరిస్థితి మరింత దిగజారి పోయే అవకాశాలే ఉన్నాయి. చైనాను నమ్ముకుంటే ఆ దేశానికి మిగిలేది అప్పులేనని ఆ దేశ అధ్యక్షుడు అర్థం చేసుకోవడం లేదు. శ్రీలంకను చూసైన వారికి తెలియడం లేదు. నిత్యావసరాల నిలిపివేత శాంపిల్ మాత్రమే.. మాల్దీవులు మరింత ఓవర్ చేస్తే మాత్రం ఆ దేశం మరింత దీనస్థితికి వెళ్లడం ఖాయం.

TAGS