India Vs Ireland : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా భారత కాలమానం ప్రకారం.. నేటి రాత్రి 8 గంటలకు ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న టీం ఇండియా ఎలాగైన మంచి ఆరంభం దక్కించుకోవాలని చూస్తోంది. టీం ఇండియా తో ఐర్లాండ్ ఇప్పటి వరకు ఏడు సార్లు తలపడగా.. ఏడింట్లోనూ ఇండియాదే పై చేయిగా ఉంది. ట్రెంట్ బ్రిడ్జిలో ఒకసారి టీ 20 మ్యాచ్ ఆడిన ఇరు జట్లు అందులో ఇండియా ఎనిమిది వికెట్ల తేడాలో గెలుపొందింది.
టీం ఇండియా విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలతో ఓపెనింగ్ ప్రారంభనించనుంది. జట్టులో జస్ ప్రీత్ బుమ్రా మెయిన్ బౌలర్ కాగా.. సిరాజ్, అర్షదీప్ సింగ్ లతో ఎవరో ఒకరికి మాత్రమే చాన్స్ వచ్చే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్ తో పాటు మూడో పేసర్ గా ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా కొనసాగనున్నాడు. జడేజాకు తోడుగా.. అక్షర్ పటేల్ టీంలోకి వస్తే బౌలింగ్ ఆల్ రౌండర్ కొరత తీరినట్లే.
వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ అందుబాటులోకి రానుండగా.. సూర్య, శివమ్ దూబె, హర్దిక్ లతో బ్యాటింగ్ దుర్బేద్యంగా మారనుంది. రోహిత్, విరాట్, సూర్య, రిషబ్, హర్దిక్, జడేజా, దూబె, అక్షర్ పటేల్, సిరాజ్, అర్షదీప్, బుమ్రాలతో మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఐర్లాండ్ కోచ్ మాట్లాడుతూ.. గత నెల క్రితం పాకిస్థాన్ ను ఓడించాం. ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ను ఓడించాం. ఈ సారి ఇండియాను కూడా ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే ఐర్లాండ్ టీంలో కూడా టెక్టార్, బాల్బన్, పాల్ స్ట్రింగ్, టెకర్ లతో బ్యాటింగ్ బలంగా ఉండగా.. బౌలింగ్ లో జోష్ లిటిల్ ప్రధాన పేసర్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు ఇండియా పై గెలిచిన రికార్డు లేకున్నా.. ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఓటమి మూట గట్టుకోక తప్పదు.