Eric Garcetti : భారత్-అమెరికా మైత్రి గొప్పది..: ఎరిక్ గార్సెట్టీ  

Eric Garcetti

Eric Garcetti

Eric Garcetti : యూఎస్-ఇండియా సంబంధం ‘కొత్త శిఖరాలకు’ చేరుకుంటోంది.’ ఈ వ్యాఖ్యలు చేసింది యునైటెడ్ స్టేట్స్ రాయబారిగా సంవత్సరం పూర్తి చేసుకున్న రాయబారి ఎరిక్ గార్సెట్టి. గార్సెట్టి 12 నెలలు భారతదేశంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ X (ట్విటర్)లో దాదాపు నాలుగు నిమిషాల వీడియోను షేర్ చేశారు. ఆయన ఇలా రాశారు. ‘ఇది ఎంత అద్భుతంగా ఉందో.. దౌత్యం మరియు లోతైన స్నేహాల సుడిగుండం!’

లాస్ ఏంజిల్స్ మాజీ మేయరైన గార్సెట్టి మార్చి 15, 2023న భారతదేశంలో US అంబాసిడర్‌గా నియమింపబడ్డారు.


‘భారతదేశంలో యూఎస్ రాయబారిగా జర్నీ మొదలు పెట్టి సంవత్సరం! ఇది ఎంత అద్భుతంగా ఉందంటే శక్తివంతమైన సంస్కృతుల్లోకి ప్రవేశించడం నుంచి ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం వరకు, ప్రతీ క్షణం అపురూపమైనది. కానీ ఇది ప్రజల ప్రేమ, మా భాగస్వామ్య కలలు నిజంగా నా హృదయాన్ని దోచుకున్నాయి. #USIndia భాగస్వామ్యానికి సంబంధించిన తదుపరి అధ్యాయాన్ని రాస్తున్నాను’ అని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆయన తెలిపారు.

న్యూఢిల్లీలోని విశాలమైన యూఎస్ ఎంబసీ ప్రాంగణంలో చిత్రీకరించిన ఆకర్షణీయమైన వీడియోలో, గార్సెట్టి భారతదేశంలో తన అనుభవం, యూఎస్-ఇండియా సంబంధాల గురించి మాట్లాడారు. మధ్యలో హిందీ పదాలు, పదబంధాలు కూడా వాడారు.

‘76 సంవత్సరాల్లో 2023 సంవత్సరం చాలా ఒప్పందాలు, చాలా రాతపని, చాలా విజయాలతో అత్యంత గొప్ప ఏడాది కావచ్చు’ అని అతను వీడియోలో చెప్పాడు. తాను విధుల్లో చేరినప్పటి నుంచి 22 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను  సందర్శించానని, వాఘా నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కొహిమా వరకు ప్రదేశాలను చూశానని ఆయన చెప్పారు. తెలిపారు.

‘గత సంవత్సరం NASA మరియు ISRO కలిసి తయారు చేస్తున్న మొదటి ఉపగ్రహం NISARలో భారీ పురోగతిని కనిపించింది. భూమి నుంచి అంతరిక్షం వరకు ఇరు దేశాలు కలిసి ప్రపంచానికి ఆదర్శంగా ఉండబోతాయన్నారు. గార్సెట్టి యూఎస్-ఇండియా రెండు-మార్గం వాణిజ్య పరిమాణం మరియు 2023లో యూఎస్ భారతీయులకు జారీ చేసిన వీసాల గురించి కూడా మాట్లాడారు.

TAGS