Mallikarjun Kharge : ‘ఇండియా కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge : ఇండియా కూటమి బలంగా పుంజుకుందని, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగానికి ముప్పు, ప్రజాస్వామ్యంపై దాడి వంటివే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో తాము ప్రతి రాష్ట్రంలో బాగా మెరుగుపడినట్లు ఖర్గే తెలిపారు. బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామన్న విశ్వాసం ఉందన్నారు.

బీహార్ లో కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి బీజేపీ భావజాలంపై పోరాడుతున్నాయని, దళిత, వెనుకబడిన వర్గాల తమ కూటమికి మద్దతు పలుకుతున్నాయని ఆయన వెల్లడించారు. యూపీలో ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ నేతలు కలిసి ప్రచారం చేయడం కూడా కూటమికి కలిసొచ్చే అంశమన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పార్టీ గతం కంటే ఎక్కువ సీట్లను సాధిస్తుందని, మహారాష్ట్రలో కూడా ఎంవీఏ అలయన్స్ మంచి సంఖ్యలో స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

TAGS