India alliance : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుపొందగా, బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. ఒక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
పంజాబ్ 1, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పశ్చిమ బెంగాల్ 4, మధ్యప్రదేశ్ 1, బీహార్ 1, తమిళనాడు 1 లో 13 అసెంబ్లీ స్ఘానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియ నిన్న (శనివారం) ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం వరకు కొనసాగింది.