IND Vs ENG : జైస్వాల్ జోర్దార్.. మరో విధ్వంసకర సెంచరీ.. డ్రెస్సింగ్ రూంలో రోహిత్ సంతోషం చూస్తే..

IND Vs ENG

IND Vs ENG Test Match, Yashasvi Jaiswal

IND Vs ENG : రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో  టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ కొట్టాడు. 122 బంతుల్లో శతకం బాదాడు. తన టెస్టు కెరీర్ లో ఇది మూడో సెంచరీ. కాగా, ఈ సిరీస్ లో తొలి టెస్ట్ లో హాఫ్ సెంచరీ, రెండో టెస్ట్ లో జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు జైస్వాల్ బజ్ బాల్ కు బదులుగా ‘జైస్ బాల్’ రుచి చూపిస్తున్నడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. టీ 20 తరహా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత నిదానంగా ఆడిన జైస్వాల్ ఆచితూచి బంతులను ఎదుర్కొంటూ పరుగులు తీశాడు. ఓ దశలో 73 బంతుల్లో జైస్వాల్ చేసిన పరుగులు 35 మాత్రమే. ఆ తర్వాత పూనకం వచ్చినట్టుగా జైస్వాల్ చెలరేగిపోయాడు. అండర్సన్ బౌలింగ్ లో 6,4,4 బాదాడు. ఆ తర్వాత టామ్ హర్ట్ లీ వేసిన ఓవర్ లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి 78 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

స్వీప్, రివర్స్ స్వీప్, లాప్టెడ్ షాట్లతో జైస్వాల్ బౌండరీల మోత మోగించాడు. బౌండరీతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. గాల్లో జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ శర్మ ‘కమాన్’ అంటూ జైస్వాల్ సెంచరీని సంబరాలు చేసుకోవడం విశేషం.

కాగా, ఇవాళ ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 196/2 స్కోర్ తో కొనసాగుతోంది. క్రీజ్ లో శుభమన్ గిల్(65), కులదీప్ యాదవ్ (3) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (104) సెంచరీ చేశారు. రిటైర్డ్ హర్ట్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ పై టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 పరుగులకే పరిమితమైంది.

 

TAGS