JAISW News Telugu

Mahila Bus Depo : దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపో ప్రారంభం

Mahila Bus Depo : దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్ లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు సఖి డిపో అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే అని, దీని కోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించినట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది మహిళలు బస్ కండక్టర్లుగా, ఇతర సిబ్బందిగీ తమ సేవలు అందిస్తున్నారని, ఇకపై డ్రైవర్లుగానూ తమ ప్రతిభను చాటుకుంటారని అన్నారు. దేశంలో ఇది ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Exit mobile version