Pawan Kalyan : పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు – కేసులు నమోదు

Pawan Kalyan : సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టు పెట్టడం కలకలం రేపింది. ఏడున్నరేళ్ల బాలుడిపై విచక్షణలేని వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అంతేకాక, ఆ పోస్టును సమర్థించినవారిపైనా చర్యలు తీసుకుంటూ, కేసులు నమోదు చేశారు. వారికి అరెస్టు చేసే చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

TAGS