Fat girls : ఒక్కో దేశంలో పెళ్లి చేసుకోవడానికి కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమంది లావుగా ఉంటేనే చేసుకుంటారు. ఇంకొందరు నల్లగా ఉన్న వారిని చేసుకోవాలనుకుంటారు. ఇంకొందరు తెల్లగా ఉంటేనే ఓకే అంటారు. వివిధ దేశాల్లో వివిధ సంప్రదాయాలు పాటిస్తూ ఆయా పద్ధతుల ద్వారా వివాహాలు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఉత్తర పశ్చిమ ఆఫ్రికాలోని మౌరిటోనియా అనే దేశంలో విచిత్రమైన సంప్రదాయం ఉంది. అమ్మాయిలు లావుగా ఉంటేనే పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ఇష్టపడతారంట. దీనికోసం అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తారు.
ఎక్కువగా ఆహారం తీసుకొని ఎక్కువగా లావు అయితే అప్పుడు వారిని పెళ్లి చేసుకునేందుకు ఎక్కువమంది ఇష్టం వ్యక్తం చేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇలా చేయడం వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఆ దేశంలో లావుగా ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని వారికి కూడా మంచి జరుగుతుందని బలంగా నమ్ముతారు. ఒకప్పటి నుంచి ఈ దేశంలో ఇలాంటి విధానం కొనసాగుతుంది. దీని ద్వారా అనేకమంది అమ్మాయిలు చిన్నప్పటి నుంచే లావు కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇలా మౌరిటోనియా దేశంలో లావుగా ఉండేందుకు అమ్మాయిల కోసం వారి తల్లిదండ్రులు చిన్నప్పటినుండే ఫుడ్ ఎక్కువగా పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ సంప్రదాయం వల్ల అనేక రకాలైనటువంటి లబ్ది వారికి చేకూరుతుంది. కాగా చాలామందికి ఉబకాయ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఇప్పుడు లావు కావడం అనేది తగ్గిస్తున్నారు. కొంతమంది అధిక బరువు ఉండటం వల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వీటి వల్ల హాస్పటల్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది.కాబట్టి ఇప్పుడు ఎక్కువగా లావు అయ్యేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.