JAISW News Telugu

dark side : రంగుల ప్రపంచంలో.. కనిపించని చీకటి కోణాలెన్నో..?

dark side

dark side

dark side of Film Industry : సినిమా అనే రంగుల ప్రపంచంలో విహరించాలని ఎంతో మంది కలలుకంటుంటారు. అందం, అభినయం ఉన్నా కొంత మందికి కాలం కలిసి రాక మరుగున పడిపోతుంటారు. మరికొందరు ఏ టాలెంట్ లేకున్నా వాళ్లకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు. కొంత మంది అమ్మాయిలు తమను తాము తెర మీద చూసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నారు. ఇందు కోసం యాక్టింగ్ స్కిల్స్ తో పాటు డ్యాన్స్, శరీర సౌష్టవాన్ని కాపాడుకునేందుకు ఫిట్‌నెస్ ట్రైనింగూ తీసుకుంటున్నారు. కానీ వారు ఇండస్ర్టీకి పరిచయం కావాలన్నా, అవకాశాలు ఇవ్వాలన్నా కొంత మంది కమిట్ మెంట్ పేరిట వేధింపులకు గురి చేస్తూ మొగ్గ దశలోనే వారి ఆశలను చిదిమేస్తున్నారు.

సినిమా ఇండస్ర్టీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచి ఉందనే రూమర్ ఉన్నా, ఇటీవల కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. ఇందుకు మలయాళ ఇండస్ట్రీలో జరిగిన దారుణాల గురించి హేమ కమిటీ ఇచ్చిన నివేదికే ఉదాహరణ.   ఈ వేధింపులు ఒక్క మలయాళ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, తెలుగులోనూ పలు సందర్భాల్లో బయట పడిన సందర్భాలు ఉన్నాయి.  22 ఏళ్ల క్రితం కృష్ణవంశీ తీసిన ఖడ్గం సినిమా ఇప్పుడు అందరి నోటా నానుతున్నది. హీరోయిన్ కావాలనే ఓ యుతి ఒక్క చాన్స్ అంటూ పడే తిప్పలు, అందులో డైరెక్టర్ అడిగే కమిట్ మెంట్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.

నాలుగేళ్ల క్రితం సింగర్ చిన్నయి చేసిన మీటూ ఉద్యమం, శ్రీరెడ్డి ఉదంత ఇందుకు మరో ఉదాహరణ. ఇటీవల ఓ కొరియా గ్రాఫర్, మరో యూ ట్యూబర్  ఘటనలు కాస్టింగ్ కౌచ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.  అయితే ఇది ఏ ఒక్క దర్శకుడికో, నిర్మాతకో అపాదించడానికి ఆస్కారం లేదు. పలానా వారి వద్ద నీకు అవకాశం ఇప్పిస్తాను.. కానీ అంటూ నసుగుతూ అమ్మాయిలను శారీరకంగా లోబర్చుకునేందుకు శతవిధాలా జరుగుతున్నాయి.

ఇక కొంత మంది ప్రొడ్యూసర్లు తామేదో రసిక రాజులం అనే ధోరణితో వ్యవరిస్తున్నరనే రూమర్లు కూడా ఉన్నాయి. తన సినిమాలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో కొందరు నిర్మాతలు డిసైడ్ ఫ్యాక్టర్లు అవుతున్నారు. పెద్ద డైరెక్టర్ ఉన్నా అన్నీ తాను అనుకున్నట్లే జరగాలి అనే ప్రొడ్యూసర్లు హీరోయిన్లు, మిగతా ఫిమేల్ యాక్టర్ల ఎంపికలో అన్నీ తామై ముందుకు సాగుతున్నారనే అపవాదు ఉన్నది. డబ్బులు పెట్టేది నిర్మాత, నాకెందుకీ తలనొప్పి అనే ధోరణితో కొంత మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు అడ్డు చెప్పలేకపోతున్నారు. ఈ సినిమా హిట్టయితే తనకు మరో నాలుగు సినిమాలు చేతికి వస్తాయని డైరెక్టర్లు భావిస్తున్నారు.  నటిగా రెమ్యూనరేషన్ ఇస్తున్నాను.. కానీ నాకేంటి అనే ధోరణి కొంత మంది ప్రొడ్యూసర్లలో విపరీతంగా పెరిగిపోతున్నది.

ఇక టాప్ హీరోల చిత్రాల్లో నటిస్తే భవిష్యత్ ఉంటుందని కొంత మంది హీరోయిన్లు కూడా అంతర్గతంగా అన్నింటికీ ఓకే అంటున్నట్లు తెలుస్తున్నది. అటు డబ్బు, ఇటు పేరు వస్తుండడంతో దేనికైనా సరే అని తలూపుతున్నట్లు కొంత మంది పెద్దలు తెర వెనుక బాహాటంగానే చెబుతండడం గమనార్హం. ఇక్కడ అవకాశం ఇచ్చే వారినో, లేక అవకాశం కోసం అన్నింటికీ ఓకే అంటున్న వారినో తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. ఈ విషయాన్నే కొంత మంది టాప్ ప్రొడ్యూసర్లు సైతం అంతర్గత చర్చల్లో లేవనెత్తినట్లు టాక్ ఉంది. అవకాశం కోసం వాళ్లే కమిట్ మెంట్ ఇస్తు్న్నారనే వాదన కూడా అంతర్గంతం జరుగుతన్నదని టాక్.

ఏ చిన్మయో,లేక శ్రీరెడ్డో, లేదా ఓ అసిస్టెంట్ కొరియో గ్రాఫరో తాము మోసపోయామంటూ ముందుకు వస్తే తప్ప రంగుల ప్రపంచంలోని చీకటి కోణం బయట పడడం లేదు. ఈ రంగుల ప్రపంచంలో ఇంకెన్ని చీకటి కోణాలున్నాయోననే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది.

Exit mobile version