Telangana : తెలంగాణ పదేళ్ల ప్రస్తానంలో విజయాలే ఎక్కువే..
Telangana : ఈ జూన్ 2 వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కంప్లైంట్ అవుతోంది. 11వ ఏడులోకి అడుగుపెడుతున్న తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. ముఖ్యంగా విద్యుత్ విషయంలో ఎన్నో ఘనతలు సాధించుకుంది. 24 గంటల కరెంట్ తో రాష్ట్రంలో రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు ఎన్నో ఉపయోగాలు కలిగాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన సమయంలో చాలా మంది తెలంగాణ అంధకారంలో మునిగిపోతుందని జోస్యం చెప్పారు. అలాంటి వారందరి కన్నులు తెరిపించేలా అభివృద్ధి బాటలో పయనించి తాను అనుకున్న లక్ష్యాల్ని చేరుకుంది. ముఖ్యంగా సాగునీటి విషయంలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాలు సస్య శ్యామలం అయ్యాయి.
హైదరాబాద్ లో చాలా మంది ఖాళీలు చేసి పోతారు. అభివృద్ధి కుంటు పడుతుందని హెచ్చరించారు. కానీ ఇవేవీ నిజం కావని గత సర్కారు చేసి చూపించింది. ప్రతి ఒక్కరి డెవలప్ మెంట్ కోసం తాము కృషి చేస్తామని చెప్పిన గవర్నమెంట్ అదే విధంగా హైదరాబాద్ లో అనేక రకాల అవకాశాలు కల్పించారు. ఐటీ రంగం డెవలప్ మెంట్, నగరంలో ప్లై ఓవర్ల నిర్మాణం, తాగునీటి సప్లై ఇలా అనేక రకాల డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టారు.
.ప్రత్యేక రాష్ట్రంగా మారిన తెలంగాణలో స్పష్టమైన మార్పు కనిపిస్తుండగా.. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. హైదరాబాద్ నగరం ఊహించనంతగా డెవలప్ అయింది. తలసారి ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు. జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం సవాల్ గా మారుతోంది. ఃకానీ తెలంగాణ రాక ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఉద్యోగాల కల్పన. నిరుద్యోగం లేకుండా నియామకాల విషయంలో యువత అంచనాలను మాత్రం అందుకోెలేకపోయారు. టీఎస్ఫీఎస్పీ లో ఉద్యోగాల కుంభకోణం విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత రావడంతో బీఆర్ఎస్ అధికారంలోకి కోల్పోవాల్సి వచ్చింది.