Assembly Elections:మార్చి రెండో వారంలో.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్?
ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఊహాగానాలకు చెక్ పడింది. మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రా ల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు చేస్తున్నారు.
2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు .ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ వెలువడు తుందని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ ఊహాగానాలు వచ్చాయి.
ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఊహాగానాలను కొట్టి పారేస్తున్న ఎన్నికల కమిషన్ వర్గాలు – గతంలో లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటున్న ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలి పాయి. ఇప్పటి వరకు కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన చేశారు.
ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఒరిస్సాలో ఎన్నికల సంఘం పర్యటన చేసే అవకాశం ఉంది .ఆ తరువాత బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీల్లో పర్యటన – ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన చేసే అవకాశం ఉంది.