JAISW News Telugu

Medaram Jathara : మేడారం జాతరలో వీరికి కాసుల పంటే..రెండేండ్ల దాక సరిపోను సంపాదన..

Medaram Jathara

Medaram Jathara

Medaram Jathara : మేడారం మహా జాతరకు మరో ఐదు రోజులే ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సమ్మక్క జాతర హడావిడి మొదలైంది. తెలంగాణ దారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారానికి కోట్లాది భక్తులు తరలివస్తుంటారు. గిరిజన సమ్మక్క, సారాలమ్మలు ఇక్కడి ఆరాధ్య దైవాలు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. సమ్మక్క జాతరలో ప్రధాన ఘట్టం.. గద్దెలపైకి సమ్మక్క తల్లి రావడం..ఈ వేడుకను చూసేందుకు ఆ సమయంలోనే భక్తుల తాకిడి లక్షల్లో ఉంటుంది. సమ్మక్క వచ్చే రోజు జాతరలో కనీసం 60 లక్షల దాక ఉంటారని అంచనా. ఇక ముందు, వెనక రోజులు అన్నీ కలిపి దాదాపు కోటిన్నర భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. ఈ అద్భుత జాతరను ప్రపంచానికి చాటేందుకు దేశీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా మేడారానికి వస్తుంది.

ఎన్నో ఘనతలను, విశిష్టతలను తనలో నింపుకున్న మేడారం జాతర వస్తుందంటే లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. సమ్మక్క, సారాలమ్మల ప్రధాన నైవేద్యం బంగారంగా పిలుచుకునే బెల్లం. అలాగే కోళ్లు, మేకలు, గొర్రెలు, కొబ్బరి కాయలు వీటితో పాటు లిక్కర్ కూడా. ఈ వ్యాపారాల వాళ్లకు సమ్మక్క జాతర వస్తుందంటే పండుగే పండుగ.

మేడారం ప్రత్యేకత ఏంటంటే.. అమ్మలకు భక్తులు  నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తారు. తాము కోరుకున్నది జరిగితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుంటారు. అది జరిగితే ఇలా మొక్కులు చెల్లించుకుంటారు.  అమ్మవార్ల మొక్కుల్లో ప్రధానమైన బెల్లం ప్రధానమైంది కాబట్టి.. ఈ వ్యాపారం సమ్మక్క జాతరలో కోట్లలో జరుగుతుంది. వేలాది మంది వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతుంది.

మేడారం జాతరకు నెల రోజుల ముందే బెల్లం వ్యాపారం జోరందుకుంటుంది. వరంగల్ ప్రాంతానికి వివిధ ప్రదేశాల నుంచి బెల్లం రవాణా అవుతుంది. వరంగల్ బీట్ బజార్ నుంచి అత్యధికంగా బెల్లం రవాణా అవుతుంది. ఉమ్మడి వరంగల్ లోని వివిధ ప్రాంతాలకు టోకుగా కూడా ఇక్కడి నుంచే వ్యాపారులు తీసుకెళ్తారు.  మాములు రోజుల్లో పది టన్నుల వరకు బెల్లం బిజినెస్ జరిగితే.. జాతర సమయంలో 40టన్నులకు పైబడి జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. టోకు వర్తకమే 14 కోట్ల వరకు సాగుతుందట. చిల్లర ధరతో కలుపుకుంటే జాతర పేరిట బెల్లం వ్యాపారం రూ.20 కోట్లకు పైబడి జరుగుతుందని చెబుతున్నారు.

సంవత్సరమంతా కష్టపడిన రాని డబ్బులు.. సమ్మక్క జాతర సమయంలోనే సంపాదిస్తారని అంటున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో బెల్లం 35-40 రూపాయలు ఉండగా.. సిండికేట్ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతారని తద్వారా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తారని చెబుతారు.

Exit mobile version