AP Politics : ‘జగన్’ రాజ్యంలో ‘కుప్పం’ వాస్తవ్యులు..!
AP Politics : తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా.. రాష్ట్రానికి రాజధాని అమరావతినే.. నన్ను నమ్మండి.. ఒక్క అవకాశం ఇవ్వండి.. తండ్రి లేని బిడ్డను నా అభ్యర్థనను ఆలకించండి అంటే నమ్మి 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారు ప్రజలు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 3 రాజధానులు అంటూ 2024లో రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయారు జగన్. ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలస్ కేంద్రంగా రాజకీయాలు నడిపారు. తాడేపల్లిని తన రాజ్యంగా సృష్టించుకున్నారు.
సాధారణ ప్రజలు రాజు దగ్గరకు రాకుండా భటులు అడ్డుగా ఉన్నట్లు తన ప్యాలెస్ గుండా వెళ్లకుండా దారిని సైతం జగన్ మూయించి వేశారు. అధికారంలో ఉన్నానని ఒక రాజులా విర్రవీగాడు జగన్. ఇప్పుడు ఆ రాజ్యంలోకి కుప్పం వాస్తవ్యుడైన లోకేష్ అడుగు పెట్టాడు. రాజ్యాలు కూల్చలేకపోయినా రాజ్యానికి వెళ్లే మార్గాలను కూల్చారు లోకేష్. ప్యాలెస్ కు వెళ్లే దారి మూస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకున్నారా జగన్. అదేమైనా నీ తాత జాగీరా? ప్రజల సొమ్ము అంటూ ఆ దారిని అందుబాటులోకి తెచ్చారు.
దాదాపు 40 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరని ప్రాంతంలో జెండా పాతిన నారా లోకేశ్ నారా వారి, టీడీపీ గట్స్ ను జగన్ కు రుచి చూపించారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91వేల ఓట్ల భారీ మెజారిటీతో కంచుకోటగా మలుచుకున్నారు. తాడేపల్లినే కాదు మంగళగిరిలో ఉన్న జగన్ సామాజిక వర్గాన్ని కూడా టీడీపీకి మద్దతుదారులుగా చేసుకోవంలో సఫలీకృతమయ్యారు లోకేష్. ఆ నియోజకవర్గం పక్కనే ఉన్న ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అదే మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నివాసం ఏర్పరుచుకున్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఇటువంటి కీలకమైన స్థానంలో తన పట్టును పెంచుకోలేకపోయింది. గత (2019) ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ లోకేష్ ఎక్కడికి పారిపోలేదు. అక్కడే పోటీ చేస్తానని అన్నాడు. ఆ సీటు కోసమే కోట్లాడాడు. అదే ఆళ్లను బయటకు పంపి వైసీపీ కోటను బద్ధలు కొట్టి తన కంచుకోటగా మార్చుకున్నాడు.
తను కూర్చుకున్న కొమ్మను తానే నరికేసుకున్నట్టు, తన పిల్లల్ని తానే తిన్నట్లు జగన్ కూడా తను నివాసముంటున్న ప్రాంతం భూమిని మింగేస్తున్నారంటూ తాడేపల్లి వాస్తవ్యులు మండిపడుతున్నారు. గత టీడీపీ హయాంలో తాడేపల్లిలో ఉన్న భూమి విలువ జగన్ రాగానే సగం కంటే ఎక్కువగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ టీడీపీ రావడం, ఇక్కడ లోకేష్ ఉండడం మంగళగిరికి మహర్ధశ పట్టినట్లేనని స్థానికులు అంటున్నారు. ఎక్కడో రాయలసీమ చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి వచ్చిన నారా వారి కుటుంబం ఇక్కడి ప్రాంతం అభివృద్ధిపై తాపత్రయ పడుతుంటే ఇక్కడే పుట్టి పెరిగిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఈ ప్రాంత పతనాన్ని కోరుకుంటున్నారు అంటూ ఆర్కేపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కష్టం ఉందని తలుపుతడితే అండగా ఉంటున్నాడు లోకేశ్. కుప్పం వాస్తవ్యులైనా చంద్రబాబు కుటుంబం తాడేపల్లిలో ఉండడంతో దీంతో ‘జగన్ రాజ్యంలో కుప్పం వాస్తవ్యులు’ అంటూ వైసీపీకి స్థానికంగా సెటైర్లు పేలుతున్నాయి.