Bhashyam Praveen : ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి హవా..పెదకూరపాడులో ‘భాష్యం’దే జోరు
Bhashyam Praveen : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడి ముగిసిపోయింది. దాదాపు రెండు నెలల పాటు మండుటెండల్లో ప్రచారంలో చేసి అలసిపోయిన అభ్యర్థులు ఓట్ల లెక్కల్లో పడ్డారు. నియోజకవర్గంలో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయి..ప్రత్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయి..అనే లెక్కలు తీసుకుంటున్నారు. అనధికార సర్వేలు ఎన్నో బయటకు వస్తున్నాయి. పార్టీల వారీగా ఏ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నారు.
వివిధ సర్వేల ద్వారా టీడీపీ కూటమికే అధికారం దక్కబోతుందనే సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ కూటమి సత్తా చూపినట్టు ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది.
గుంటూరు ఈస్ట్ : 70.47 శాతం
గుంటూరు వెస్ట్ : 66.53 శాతం
తెనాలి : 76.16 శాతం
ప్రత్తిపాడు : 82.53
పొన్నూరు : 84.98
మంగళగిరి : 85.74
తాడికొండ : 87.47
చిలకలూరిపేట : 85.00
గురజాల : 84.30
మాచర్ల : 83.75
నరసరావుపేట : 81.06
పెదకూరపాడు : 89.18
సత్తెన్నపల్లి : 86.97
వినుకొండ : 89.22
బాపట్ల : 83.02
వేమూరు : 86.43
రేపల్లె : 82.59
కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. పెదకూరపాడు, వినుకొండలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 17 నియోజకవర్గాల్లో టీడీపీ 15 స్థానాలను, వైసీపీ 2 చోట్ల గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. వైసీపీ ఐదేండ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉమ్మడి జిల్లాలో బాగా కనిపించింది. వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై విసిగిపోయిన జనాలు గంపగుత్తగా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ఇక పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయఢంకా మోగించబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. భాష్యం ప్రవీణ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు అనధికార సర్వేలు వెల్లడిస్తున్నాయి.