Mukesh Kumar Meena : ఈవీఎం ధ్వంసం ఘటనలో.. పీవో, ఏపీవోల సస్పెన్షన్ కు ఆదేశాలు
Mukesh Kumar Meena : ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నాయకులు ఇప్పుడు వెళ్లడం సరికాదని, పరామర్శకు ఈసమయంలో వెళ్ల వద్దని రాజకీయ నేతలకు సీఈవో విజ్ఞప్తి చేశారు.
బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లకూడదని, ఎవరినీ ఆ గ్రామాలకు వెళ్లనీయొద్దని సూచనలు జారీ చేసినట్లు సీఈవో తెలిపారు. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు. దర్యాప్తు సమయంలో ఎక్కడో.. ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లాయని అన్నారు. ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు రాష్ట్రంటలో పర్యటిస్తామని ఎంకే మీనా తెలిపారు.