Anchor Anasuya : చివరికి కుక్కని కూడా వదిలిపెట్టని యాంకర్ అనసూయ..మండిపడుతున్న నెటిజెన్స్!
Anchor Anasuya : జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను పొందిన వారిలో ఒకరు యాంకర్ అనసూయ. ఈ షో ద్వారా ఈమె సంపాదించిన క్రేజ్ మామూలుది కాదు. ఆ క్రేజ్ తో ఆమెకి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. చూసేందుకు అనుష్క పోలికలతో ఎంతో హాట్ గా కనిపించే అనసూయ ఇండస్ట్రీ లో హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈమెకి ఎక్కువగా విలన్ రోల్స్ మరియు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ దక్కాయి.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప’ సినిమాలో విలన్ రోల్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు అనసూయ. తన మూడ్ కి తగ్గట్టు ఏది తోచితే అది సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
ఈమె చేసే బోల్డ్ కామెంట్స్, అప్లోడ్ చేసే బోల్డ్ ఫోటోలు, వీడియోలకు నెటిజెన్స్ ఎవ్వరూ కూడా నెగటివ్ కామెంట్స్ చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం చాలా ఫైర్ అయిపోతుంది. ఇది వరకు ఎంతో మంది నెటిజెన్స్ పై ఆమె అలాగే ఫైర్ అయ్యింది. కొంతమంది మీద పోలీస్ కేసులు కూడా నమోదు చేసింది. 38 ఏళ్ళ వయస్సు ఉన్న ఇద్దరు పిల్లల తల్లి పొట్టి బట్టలు, బికినీలు వంటివి వేసుకొని తిరిగితే ఎవరైనా అలాగే కామెంట్ చేస్తారు , అందులో తప్పు లేదు. రేపు తన ఇద్దరి కొడుకులు ఒక వయస్సుకి వచ్చిన తర్వాత ఆ ఫోటోలను చూసి ఏమనుకుంటారు అనే ఇంకిత జ్ఞానం కూడా అనసూయ ఉండదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. బాగా వర్కౌట్స్ చేసిన తర్వాత తన కుక్క ఆమె దగ్గరకి వస్తే గట్టిగా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఆ కుక్క కి ఊపిరి ఆడక అనసూయ నుండి విడిపించుకొని పారిపోతే దానిని పట్టుకొని తన తలకి దిండులాగా వాడుకుంది. దీనికి తగ్గట్టు ఒక ఆడియో ని కూడా జత చేసింది. నువ్వు చేసినపని అలాంటి ఆడియో జతచేస్తే ఎవరు మాత్రం నీ మీద నెగటివ్ కామెంట్స్ చెయ్యకుండా ఉంటారు చెప్పు?, కనీసం కుక్కని కూడా వదలవా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.