Movie Collections : ఇప్పటి పరిస్థితుల్లో రూ. 500 కోట్ల గ్రాస్ సాధ్యం అవుతుందా?
Movie Collections : పఠాన్, జవాన్ చిత్రాలతో షారుఖ్ ఖాన్ ఇండియాలో 500 కోట్ల నెట్ మార్క్ ను అందుకున్నాయి. ఇది సాధించడం ఈజీ అనే అభిప్రాయాన్ని కలిగించాయి ఈ రెండు మూవీస్ పఠాన్, జవాన్ తర్వాత యానిమల్, గదర్ 2 కూడా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ ను దాటాయి. అప్పటి నుంచి ఇండియాలో ప్రతీ భారీ మూవీ 500 కోట్లు కాకపోయినా వరల్డ్ వైడ్ గా కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలనే అంచనాకు వచ్చాయి. అయితే, మహమ్మారి కొవిడ్ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది అంత సులువైన విషయం కావడం లేదు.
సలార్ వరల్డ్ వైడ్ గా 600 కోట్లు వసూలు చేసింది. దీనికి ముఖ్య కారణం ఐదు భాషల్లో రిలీజ్ కావడమే. టైగర్ 3 వరల్డ్ వైడ్ గా రూ. 450 కోట్లు దాటగా, డుంకీ రూ. 470 కోట్ల గ్రాస్ దాటింది.
ఈ ఏడాది విడుదలైన ఫైటర్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశ మిగిల్చి 350 కోట్ల గ్రాస్ వైపునకు దూసకుపోతోంది. హను-మాన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా సుమారు 275 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఆ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్న సినిమాకు అసాధారణం.
రూ. 500 కోట్ల గ్రాస్ చేరాలంటే కీలక విషయాలు
సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఆడియన్స్ లో క్యూరియాసిటీ తేవాలి. టీజర్లను ఊహకు అందని విధంగా కట్ చేయాలి. మ్యూజిక్ కూడా వీటికి తోడవుతుంది. ఆపై అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ దక్కాలంటే ట్రైలర్ విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. నేటి చిత్ర పరిశ్రమలో ప్రీ రిలీజ్ బజే కీలకం. ఇవన్నీ సరిగా లేకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ డే కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇది మొత్తం బజ్ తగ్గేందుకు దారితీస్తుంది.
‘జవాన్’, ‘యానిమల్’ సాలిడ్ ట్రైలర్లు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ కు తెరలేపాయి. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా, ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ సాధించడం కష్టమైన పనే. కేవలం ఇండియా నుంచి మాత్రమే 500 కోట్ల కలెక్ట్ చేయడం మరో విషయం. పైన చెప్పిన అంశాలతో పాటు ఈ సినిమాకు అసాధారణమైన మౌత్ టాక్, కనీసం రెండు వారాల పాటు క్లాష్ ఫ్రీ రన్, అదృష్టం కూడా అవసరం.
ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ ఫిగర్ ను క్రాస్ చేసే అవకాశం ఉన్న సినిమాలని ఇప్పటికే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యింది.