JAISW News Telugu

Congress : కాంగ్రెస్ లో ‘పట్టభద్రుల లొల్లి 

Congress

Congress MLC Teenmaar Mallanna

Congress : కాంగ్రెస్ పార్టీలో కొత్త ఎమ్మెల్సీ లొల్లి మొదలైంది. ఆ గొడవ వెనుక పైసల పంచాయితీ. అదికాస్తా పోలీస్ స్టేషన్ దాక వెళ్ళింది. దింతో గెలిచిన  సంతోషం కాస్త బజారున పడి పరువుపోయింది. ఇప్పుడు గెలిచిన ఆ తీన్మార్ మల్లన్న పరిస్థితి సంతోషం కంటే తక్కువైనది. ప్రతిపక్ష పార్టీల ముందు కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి తయారైనది. పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్ దాక వెళ్లడంతో కాంగ్రెస్ నాయకులు కూడా తలపట్టుకోక తప్పలేదు.

ఇటీవల నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరించడం లేదంటూ  ఆరోపణ. మంత్రి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లకు అదే జిల్లాకు చెందిన ఒక యు ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి ద్వారా మల్లన్న కౌన్సిలర్లకు డబ్బులు ముట్టచెప్పినట్టు ఆరోపణ. కానీ ఆ డబ్బులు మంత్రికి తెలియకుండానే పంపిణి జరిగినట్టు సమాచారం. కానీ కొందరు కౌన్సిలర్లు మాత్రం తమకు డబ్బులు ముట్టలేదని ఆరోపిస్తూ యు ట్యూబ్ ముందు గొడవకు దిగారు. ఇది కాస్త చిలికి, చిలికి గాలివానలా తయారై మల్లన్న అనుచరుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళు రంగంలోకి దిగి ఛానల్ నిర్వాహకుడితో అరా తీశారు. ఆయన కూడా ఎవరెవరికి డబ్బులు ముట్టచెపిందో వివరంగా పేర్లతో సహా బయట పెట్టాడు.

యు ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఇచ్చిన పేర్ల ప్రకారం తప్పు అని లక్ష, ఇచ్చి రెండు లక్షలు అంటున్నాడని, యాబై వేలు ఇచ్చి లక్ష అంటున్నాడని కొందరు కౌన్సిలర్లు ఆరోపించారు. డబ్బులు ముట్టనివారు నేరుగా గొడవకు దిగడంతో విషయం కాస్త బజారున పడింది. ఇది కాస్త మరో యు ట్యూబ్ ఛానల్ లో వైరల్ అయ్యింది. దింతో బబ్బులు ముట్టనివారు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో రచ్చ, రచ్చ అయ్యింది. ఇది గిట్టనివారు అవకాశం దొరికింది కదా అని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ సంబర పడిపోతున్నారు.

Exit mobile version