CM Jagan : సీఎం జగన్ పై రాళ్లదాడి కేసులో.. పోలీసు అధికారులపై వేటు

CM Jagan

CM Jagan

CM Jagan : ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారించడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇలా ఉండగా రాళ్ల దాడి ఘటనపై ఈసీ స్పందించింది. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది.

విజయవాడ సీపీ కాంతిరానా టాటా, ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించి వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ పై రాయిదాడి ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

TAGS