Srivari Laddu : లడ్డూ విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందిగా ..

Srivari Laddu

Srivari Laddu Controversy

Srivari Laddu : పూర్వం అనేక సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాల్లో నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి. కరోనా వైరస్ వస్తుందని ఆయన చెప్పారు. భారత్ కు ఈశాన్యం నుంచి మహమ్మారి వ్యాపిస్తుందని ఆయన దివ్యదృష్టితో చూసి చెప్పారు. లక్షలాది మంది చచ్చేరయా కోరంకి అనే జబ్బు వచ్చేనయా అని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు. విజయవాడకు వచ్చిన వరదను చూసి ఆయన చెప్పినట్టే వరద వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తిరుమల విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పిందే నిజం అవుతుందా అని అనుమానం వస్తుంది.

ఏడాదిలో 365రోజులు ఉంటే 400లకు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం పొందుతున్న ఆలయం ఇది. ఇక స్వామి వారి ప్రసాదం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది లడ్డూనే. అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ తిరుమల భక్తులకు దొరికేది.. ఇష్టమైనది లడ్డూనే. నిజానికి ఇలాంటి నివేదనలు ప్రపంచలోని ఏ దేవుడికి జరుగవు. లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 300ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1933లో తిరుమల ఆలయ కమిటీ ఏర్పడిన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయాలను పెంచింది. అప్పటి వరకు తిపి బూందీ ప్రసాదంగా అందుకుంటుండగా 1940నుంచి అది లడ్డూగా రూపాంతరం చెందింది. 1940లో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది.  కాలక్రమేనా వడ స్థానంలో లడ్డూ భక్తులకు ప్రసాదంగా మారింది. లడ్డూ తయారీకి వాడే ముడిసరుకులను దిట్టం అని పేరు పెట్టి వాటిని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చింది టీటీడీ. చివరి సారిగా 2001లో దిట్టాన్ని సవరించారు. మొదట్టో 5100లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. ఆ తర్వాత అవి లక్షల సంఖ్యకు పెరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డూ ధరను 50కు పెంచింద టీటీడీ.

టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ వచ్చింది.  అన్ని లడ్డూల్లా కాకుండా తిరుమల లడ్డూను తయారు చేస్తారు.  అందుకే దానికి అంత రుచి. తయారు చేసే వాళ్లు కూడా నిష్టగా ఉంటే తప్పా వంటశాలలోకి అనుమతించరు. అలా తయారు చేసిన ప్రసాదాలు శ్రీనివాసుడి తల్లి వకులామాత వద్దకు తీసుకెళ్తారు. ఆమె పెట్టిన తర్వాత శ్రీనివాసుడికి నైవేధ్యంగా పెడతారు. ఇప్పుడు లడ్డూ వ్యవహారం వివాదాస్పదమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లడ్డూ అంటే భక్తులకు ఎమోషన్. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడారనే విషయం తెలిసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన నెయ్యిని సప్లై చేసే నందిని డైరీని కాదని తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి అప్పగించారు. తక్కువ ధరకు కల్తీ నెయ్యి సేకరించి కోట్ల కొల్లగొట్టారు వైసీపీ నేతలు. ఆ డైరీకిచెందిన నెయ్యి ట్యాంకర్లలో నాణ్యత తగ్గినట్లు ఈవో శ్యామలా రావు తెలిపారు. ఈ విషయం మనకు ఇప్పుడు తెలిసింది గానీ ఆనాడే బ్రహ్మంగారు తిరుమలేశుడి ప్రసాదం కల్తీ జరుగుతుందని స్పష్టంగా చెప్పారట.  అదే కాలజ్ఞానంలో ఓ చోట తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా చెప్పారు.. ‘‘వెంకన్న గుడి నాలుగు రోజులు పూజల్లేక మూతబడెను’’ అని ఆయన పలికారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ మాట నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. 12 ఏళ్లకొసారి శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ  జరిపేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

TAGS