JAISW News Telugu

Amardeep : చీరల విషయంలో మరోసారి అమర్ దీప్ కి ఘోరమైన అవమానం..ఇక తల ఎత్తుకొని తిరగలేడు!

Amardeep

Amardeep

Amardeep : గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 లో రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా అమర్ దీప్ కి వచ్చిన ఫాలోయింగ్ మామూలుది కాదు. అతి తక్కువ మార్జిన్ తో టైటిల్ ని మిస్ అయ్యినప్పటికీ కూడా ఫ్యాన్ బేస్ పరంగా మాత్రం సీరియల్స్ లో ఉన్నప్పటి కంటే మూడింతలు ఎక్కువ అయ్యింది. ఆయనకి అంత ఫ్యాన్ బేస్ రావడానికి కారణం ఎలాంటి మాస్క్ లేకుండా ఆడడం వల్లే.

చుట్టుపక్కన 80 కెమెరాలు పైగా ఉన్నాయి, తానూ చేసే ప్రతీ పని రికార్డు అవుతుంది, కోట్లాది మంది తెలుగు ప్రజలు అది చూస్తారు అనే జాగ్రత్త అతనిలో అసలు లేదు. ఏది అనిపిస్తే అది చేసాడు, అందుకే అతని మీద అంతటి నెగటివిటీ ఏర్పడినా కూడా టాప్ 2 రేంజ్ కి రాగలిగాడు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన కొన్ని రోజులకు ఆయన హీరోగా ఒక సినిమాని ప్రారంభించాడు.

రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇది కాసేపు పక్కన పెడితే అమర్ దీప్ ఇప్పుడు బుల్లితెర మీద పలు ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ మా ఛానల్ వారు ‘బీబీ7 రీ యూనియన్’ అనే ప్రోగ్రాం ని ఏర్పాటు చేసారు. ఈ ప్రోగ్రాం లో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. అమర్ దీప్ ఈ షో లో మరోసారి హైలైట్ గా నిలిచాడు. ఎందుకంటే యాంకర్ శ్రీముఖి ఎల్ఈడీ మీద ఒక ప్రశ్న చూపిస్తూ ‘ఒక్క చీర ఆరడానికి 30 నిమిషాలు సమయం పడితే..30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది’ అని అడుగుతుంది. అప్పుడు దానికి అమర్ దీప్ ఎదో తింగరి సమాధానం చెప్పాడు. దానికి శివాజీ రెండు జోబుల్లో చేతులు పెట్టుకుంటూ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు సరదాగా.

అంటే అమర్ దీప్ ఏ రేంజ్ సమాధానం ఇచ్చి ఉంటాడో. ఒక చీర ని ఆరబెట్టడానికి 30 నిమిషాలు పడుతున్నప్పుడు, 30 చీరలు ఆరడానికి కూడా అంతే సమయం పడుతుంది కదా, ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోకుండా మనోడు అతి తెలివి తో ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు నెటిజెన్స్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు జీనియస్ టాస్క్ లో చిన్న వాటికి కూడా సమాధానం చెప్పలేక అమర్ దీప్ ఎలా నీళ్లు నమిలాడో, ఇప్పుడు కూడా అదే పని చేసాడు.

Exit mobile version