JAISW News Telugu

Hanuman : ‘హనుమాన్’  విషయంలో ప్రశాంత్ వర్మపై విమర్శల వెల్లువ.. కారణమిదే?

Hanuman

Hanuman

Jai Hanuman : హను-మాన్ సినిమాతో టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు యువ దర్శకుడు ప్రశఆంత్ వర్మ. ఇక ఒక దశలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోవాలంటూ ఆదిపురుష్ దర్శకుడిని సైతం  విమర్శించారు. హను-మాన్ సినిమాతో దేశవ్యాప్తంగా అటు ప్రేక్షకులతో పాటు నిర్మాతలను సైతం ఆకట్టుకున్నాడు. టేకింగ్ పరంగానే కాకుండా తక్కువ బడ్జెట్ లో హైఎండ్ గ్రాఫిక్స్ వర్క్ చేయించాడనే క్రెడిట్ సొంతం చేసుకున్నాడు. ఇదే దర్శకుడు ప్రశాంత్ వర్మను ఇష్టపడటానికి ప్రధాన కారణం.

ఇక ఓ ఆధ్యాత్మిక కథాంశాన్ని బేస్ చేసుకున్నప్పుడు అందులో అసభ్యతకు తావివ్వకుండా, వివాదాలకు అవకాశం ఇవ్వకుండా చక్కటి సినిమాను తెరకెక్కించాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా విజయంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కూడా ప్రశాంత్ వర్మతో టై అప్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుమారుడిని పరిచయం చేసే బాధ్యతను ఎత్తుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను కూడా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఇటీవల హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా రిషబ్ శెట్టిని ఫైనల్ చేసి లుక్ కూడా విడుదల చేశాడు. ఓ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రశాంత్ వర్మ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి దాకా ఎవరూ హనుమంతుడిని ఇలా చూపెట్టలేదనే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆంజనేయుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది వానర అవతారం. కానీ హనుమంతుడి పాత్రలో వానర అవతారం కనిపించడం లేదని, రామాయణంతో పాటు హిందూ దేవుళ్లను  వక్రీకరించడమే అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాలో రాముడి గెటప్ ను మార్చేసి దర్శకుడు ఓం రౌత్ విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా అదే తరహాలో విమర్శలకు గురవుతున్నాడు. మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే.

Exit mobile version