Jogi Ramesh : సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవ్వరూ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారు సహకరించినందున వారికి ఇచ్చిన రక్షను తొలగించాలని అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీమంత్రి జోగి రమేశ్ ను మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నిన్న (బుధవారం) డీఎస్పీ మురళీకృష్ణ సుమారు రెండు గంటల పాటు విచారించారు. జోగి రమేశ్ ను దాదాపు 27 రకాల ప్రశ్నలు అడిగామని తెలిపారు. దేనికీ ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికీ నిందితులు సెల్ ఫోన్లు సమర్పించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని డీఎస్పీ వెల్లడించారు.