Prabhas : ఆ విషయంలో ప్రభాస్ ను మించినోళ్లు లేరు!

Prabhas

Prabhas

Prabhas : ప్రభాస్ ను డార్లింగ్ అని ఫ్యాన్స్ , సినీ జనాలు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రభాస్ మనసు చాలా మంచిదని అతడితో ఉన్నవారికే కాకుండా ఆ నోటా ఈ నోటా విన్నవారికి సైతం తెలుసు. ప్రభాస్ ఉదార గుణం సైతం జనాలకు తెలిసిందే.

మిగతా హీరోలకు, ప్రభాస్ కు వ్యవహార శైలిలో చాలా తేడా ఉంటుందన్నది మాత్రం నిజం. ఇప్పుడు మేం చెప్పేది చదివితే అది మీకు అర్థమవుతుంది. ప్రభాస్ వైఖరే నిర్మాతల దృష్టిలో అతన్ని ఉన్నతంగా ఉంచుతున్నాయి. అవెంటే ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ కు రెమ్యూనరేషన్ ఇస్తే చాలు మరో రూపాయి అదనంగా ఇవ్వాల్సిన పనిలేదట. మిగిలిన హీరోలకు అలా కాదు మేకప్ మాన్, మేనేజర్, అసిస్టెంట్లు ఇలా చాలా ఉంటాయి వ్యవహారాలు. ప్రభాస్ తన కారులోనే షూటింగ్ కు వస్తారు. ఆయన మనుషులు మరో కారులో వస్తారు. కేరవాన్ సైతం ఆయనదే. కానీ దేనికీ రూపాయి నిర్మాత ఇవ్వవలిసిన అవసరం లేదు.

కానీ మిగతా హీరోలకు డ్రైవర్ కు సైతం డబ్బులు ఇవ్వాలి. సొంత కేరవాన్ అయినా దానికి ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే. ఇక అసిస్టెంట్లు, మేకప్ మ్యాన్ లు తదితరాలు ఎలాగూ ఉంటాయి. అదేవిధంగా ప్రభాస్ కూర్చునే టెంట్ కూడా ఆయనదే. ప్రభాస్ ఇంటి నుంచే షూటింగ్ లో ఎంతమంది ఉంటే అంతమందికి క్యారేజ్ వస్తుంది. ఇక తిండి ఖర్చుకు నిర్మాత రూపాయి ఇవ్వరు. అదే మిగతా హీరోలైతే ఆ స్టార్ హోటల్ అంటూ ఈ స్టార్ హోటల్ అంటూ లక్షల్లో కానిచ్చేస్తారు.  ఇక బాడీ డబుల్స్ కు, బౌన్సర్లకు ప్రభాసే చెల్లిస్తారు.

ఇక మిగిలిన హీరోల పరిస్థితి చూస్తే పూర్తి విభిన్నం. ప్రతీ దానికి ఓ ఓచర్ నిర్మాతకు వెళ్తుంది. కారు పెట్రోల్ దగ్గర నుంచి తినే తిండి దాక లక్షల్లో ఓచర్లు నిర్మాతకు వెళ్తూనే ఉంటాయి. అందువల్లనే ప్రభాస్ ను నిర్మాతల హీరో అని అంటుంటారు. ఈ విషయంలో ప్రభాస్ ను గ్రేట్ అనక తప్పదు మరి.

TAGS