Saindhav Vs Gunturkaaram : ఇటీవల పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. వినూత్న కథలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇదే మాదిరిగా ఒకే భాషలో రిలీజై కూడా వందల కోట్లు సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో లాగా సినిమా నిడివి ఎక్కువున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దర్శకుడి మదిలో మెదిలిన అన్నీ అంశాలను కవర్ చేస్తూ ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా తీస్తే నిడివి ఎక్కువైనా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మొన్న వచ్చిన యానిమల్ కూడా 3గంటల పైగా రన్ టైం ఉంది. అయినా ఆడియన్స్ బోర్ ఫీల్ కాలేదు. ఆ సినిమా 900 కోట్ల దాక వసూలు చేసింది.
అయితే రన్ టైం విషయమై ఇప్పుడు కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా నాలుగు భారీ తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో దేని రన్ టైం ఎంత? అనే చర్చ నడుస్తోంది. వీటి సెన్సార్ షిప్ కావడంతో వాటి రన్ టైం ఓపెన్ అయిపోయింది.
దాని ప్రకారం మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ రన్ టైం 2గంటల 39 నిమిషాలు. ఇక పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతున్న తేజ సజ్జ ‘హనుమాన్’ మూవీకి ఇంచుమించు ఇంతే నిడివి. దాదాపు 2గంటల 38 నిమిషాల రన్ టైం. ఇక కింగ్ నాగార్జున పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘నాసామిరంగ’ 2గంటల 26 నిమిషాలు. అయితే సంక్రాంతి సినిమా పందెం పుంజుల్లో అతి తక్కువ నిడివి ఉన్నది వెంకీమామ ‘సైంధవ్’ మూవీ అని చెబుతున్నారు. ఈ సినిమా రన్ టైం 2గంటల 20 నిమిషాలు.
రన్ టైం ఎక్కువున్న తక్కువున్న పెద్దగా ఇబ్బంది ఉండదని.. జనాలను ఆకట్టుకునేలా తీస్తే రన్ టైం ప్రభావం పడదని సినీ పండితులు చెబుతున్నారు. గత సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి రెండు సినిమాలకు 3గంటలకు పైగా రన్ టైం ఉంది.. అయినా అవి రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయని అంటున్నారు. రన్ టైం ఎక్కువున్న గుంటూరు కారమైనా, తక్కువున్న సైంధవ్ అయినా.. కథలో సత్తా, ఆకట్టుకునే కథనం ఉంటేనే జనాలు ఆదరిస్తారని చెబుతున్నారు.