Prabhas : బాహుబలి సిరీస్ తర్వాత ‘ఆదిపురుష్’ చిత్రం వరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం అయితే ఆయన పరువుని కూడా తీసేసింది. దేశవ్యాప్తంగా శ్రీరాముడిని కించపరుస్తూ తీసిన ‘ఆదిపురుష్’ ని బ్యాన్ చెయ్యాలి అంటూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. అలాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కోలుకోవడం అనేది చిన్న విషయం కాదు.
కానీ ప్రభాస్ కోలుకొని చూపించాడు. గత ఏడాది చివర్లో ‘సలార్’ చిత్రం తో తన సత్తా ఎంతో ఫ్యాన్స్ కి మరోసారి చూపెట్టాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు తప్ప, ఏ సినిమా టాలీవుడ్ సినిమా కూడా 600 కోట్ల రూపాయిలను దాటి గ్రాస్ వసూళ్లను రాబట్టలేకపోయాయి.
రీసెంట్ గానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి #RRR తరహాలో ఇతర దేశానికీ సంబంధించిన ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నారంగ్ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రభాస్ ఇతను చెయ్యి, తల ని సెకండ్ హాఫ్ లో నరికేస్తాడు. ఈ పాత్ర ని పోషించిన నటుడి పేరు ఎమ్మెస్ చౌదరి.
ఆయన ప్రభాస్ గురించి మాట్లాడుతూ ‘సలార్ చిత్రం లో ప్రభాస్ నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. అంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ నా కాళ్ళు పట్టుకుంటే బాగుండదు అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ డూప్ ని ఆ సన్నివేశం కోసం సిద్ధం చేసాడు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు, ఆ సన్నివేశం నేనే చేస్తాను అని చెప్పి చేసాడు.
అలా అంత పెద్ద సూపర్ స్టార్ మూడు సార్లు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఆ సన్నివేశం చేసాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ ని బయట రెండు మూడు సార్లు కలిసాను కానీ పెద్దగా మాట్లాడలేదు. ప్రభాస్ చాలా సింపుల్ మనిషి, తాను ఒక హీరోని అనే విషయమే అతనికి గుర్తు ఉండదు’ అంటూ ఎమ్మెస్ చౌదరి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.