Sankranti : తెలంగాణలో సంక్రాంతి అంటే సకినాలే..

Sankranti : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలు ఘుమఘుమలాడుతాయి. ఏపీలో జంతికలు, సున్నుండలు, అరిసెలు, బెల్లం గవ్వలు, కజ్జికాయలు, చల్లగుత్తులు నోరూరిస్తాయి. ఇక తెలంగాణలో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది సకినాలే. పండుగకు రెండు, మూడు రోజుల ముందే సకినాలు చేసుకుని 10-15 రోజులు లాగించేస్తారు. ఉదయం పూట టీలో వేసుకుని తింటే అదే బ్రేక్ ఫాస్ట్. పెద్దలు చికెన్, మటన్లోనూ సకినాలు వేసుకుంటారు.